WhatsApp కొత్త ఫీచర్ను పరిచయం చేస్తోంది. అదే వాయిస్ మేసేజ్ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్. వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపడాన్ని మరింత సులువుగా మార్చు తుంది ఈ ఫీచర్. ఆడియో వినడానికి సౌకర్యం లేని వారికి, వినడం కంటే చదవడం ఎక్కువగా ఇష్టపడేవారికి వాయిస్ మేసేజ్ను టెక్స్ట్ రూపంలోకి మార్చుతుంది ఈ ఫీచర్ ద్వారా మార్చుకోవచ్చు.
ఈ ఫీచర్ లోని హైలైట్స్ ..
వాట్సాప్ కస్టమర్ల భద్రతపై ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందిస్తూనే ఉంది. ఈ ట్రాన్స్ స్క్రిప్షన్ ద్వారా భద్రత అధికం నిర్ధారిస్తుంది. మొదట iOS వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా డివైజ్ లో ఇప్పటి ఉన్న అన్ని భాషల్లోకి వాయిస్ ను ట్రాన్స్ స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే.. వాయిస్ మేసేజ్ ను కన్వర్ట్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ కంటెంట్ ను కూడా ఈ ఫీచర్ ద్వారా గుర్తించవచ్చు.
వాయిస్ మేసేజ్ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ ప్రస్తుతం iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకుకూడా అందుబాటులోకి రానుంది.
ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ ను ఎలా అర్థం చేసుకోవాలి
వాట్సాప్ లలోని వాయిస్ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ చాట్ లో షేర్ చేయబడిన వాయిస్ మేసేజ్ లను వ్రాతపూర్వకంగా అంటే కంటెంట్ రూపంలో కన్ వర్ట్ చేస్తుంది. ఇది మీ కన్వర్జేషన్ ఫుల్ సెక్యూరిటీతో అందిస్తుంది. iOS యూజర్లు.. తప్పనిసరిగా iOS 16 లేదా అంతకంటే లేటెస్ట్ వెర్షన్ ను కలిగి ఉండాలి. హే సిరిని ఎనేబుల్ చేసి ఉండాలి. మీరు ఒకవేళ ఈ ఫీచర్ ను వినియోగించకూడదు అనుకుంటే.. వాట్సాప్ సెట్టింగ్ కు వెళ్లి చాట్ సెక్షన్ ద్వారా డిసేబుల్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం..
ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు వాయిస్ ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ పై ఇటీవల బెటా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకు ట్రాన్స్ స్క్రిప్షన్ ఫీచర్ ను అందిస్తున్న గూగుల్ మేసేజేస్, టెలిగ్రామ్ వంటి కాంపిటిటర్లలోవాట్సాప్ పోటీ పడనుంది.