దాదాపు రెండు గంటల అనంతరం వాట్సప్ పనిచేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12. 30 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు.. తిరిగి 2.15 గంటల నుంచి పునురద్ధరించబడ్డాయి. అందరికి మెసేజ్ లు వెళుతున్నట్లు యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. యూజర్లు మెసేజ్ లు పంపలేకపోతున్నట్లు తమ దృష్టికి రావడంతో సమస్యను పరిష్కరించినట్లు మెటా కంపెనీ ప్రతినిధి చెప్పారు.సర్వర్ డౌన్ అవడమే కారణమని... టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ వాట్సప్ ను త్వరగా రీస్టోర్ చేశారని వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 50 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వాట్సప్ డౌన్ లోడ్స్ జరిగాయి. వాట్సప్ లో రోజుకు 10వేల కోట్ల మెసేజ్ లు సెండ్ అవుతున్నాయి. 80 దేశాల్లో వాట్సప్ కు యూజర్లు ఉన్నారు. వాట్సప్ ద్వారా నిమిషానికి 2 కోట్ల 9 లక్షల మెసేజ్ లు సెండ్ అవుతున్నాయి. వాట్సప్ లో ప్రతి రోజూ 5 కోట్ల 5 లక్షలకు పైగా వీడియో కాల్స్ జరుగుతున్నాయి. యూజర్లు ప్రతి రోజూ సగటున 23 సార్లు వాట్సప్ ఓపెన్ చేస్తున్నారు . అలాగే ప్రతి రోజూ వాట్సప్ కు సగటున 10 లక్షలకు పైగా కొత్త యూజర్లు వస్తున్నారు.