ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ మెటా సంస్థ వాట్సాప్ లో కొత్త ఫీచర్స్ తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అదిరిపోయే రెండు కొత్త ఫీచర్స్ పై ప్రస్తుతం టెస్టింగ్ నడుస్తోంది. తర్వతో రెండు అందుపాటులోకి తేనుంది. అవి ఇన్ స్టాగ్రామ్ యాప్ లోని ఫీచర్స్ లా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఫీచర్ లో మీరు వేరే వ్యక్తులతో వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ నెంబర్ తో పని లేదు. ఫోన్ నెంబర్ కు బదులుగా ఓ క్యూఆర్ కోడ్ షేర్ చేసుకోని ఇతరులతో చాట్ చేసుకోవచ్చు. డేటా షేర్ చేయవచ్చు. క్యూఆర్ కోడ్ షేర్ చేసినప్పుడు మీ యూజర్ నేమ్ వారికి చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో సజేషన్స్ లా వాట్సాప్ లో కూడా ఛానల్ సజేషన్ చేస్తోంది. మీ ఇంట్రెస్టులకు అనుగుణంగా లైక్ చేసిన ఛానల్స్ మీకు సజేషన్ బాక్స్ లో చూపిస్తుంది. సిమిలర్ ఛానల్స్ మీరు ఫాలో అవ్వడానికి కొన్ని ఛానల్స్ సూచిస్తుంది. మీకు ఇష్టమైన ఛానల్స్ కంటెంట్ ను వెంటనే ఫాలో అయి పొందొచ్చు.