ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మేసేజింగ్ యాప్ వాట్సాప్ మాతృసంస్థ మెటా.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI) ద్వారా పేమెంట్స్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందించేందుకు రెడీ అవుతోంది.
వాట్సాప్ యాప్ రీసెర్చర్ AssebleDebug ప్రకారం.. వినియోగదారులు WhatsAPP బ్యాంకకు ఖాతా వివరాల పేజీలో ఈ ఫీచర్ ను అందించనున్నారు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారులు గరిష్టంగా మూడు నెలల పాటు విదేశాల్లో యూపిఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. దీనికి సంబంధించిన లీక్ స్క్రీన్ షాట్ UPI సెట్టింగ్ విభాగానికి International Payments అనే లేబుల్ జోడించబడి ఉంది.
అయితే ఇంటర్నేషనల్ పేమెంట్స్ సౌకర్యం ఫోన్ పే, గూగుల్ పే తో సహా మరికొన్ని యాప్ లలో ఇప్పటికే అందుబాటులో ఉంది. భారత దేశంలో వాట్సాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు జరుగుతున్నప్పటికీ పరిమితమైన యాక్సెస్ వల్ల Google pay, Phone pe వంటి యూపీఐ చెల్లింపు అప్లికేషన్ల కంటే వెనకబడి ఉంది. ముఖ్యంగా UPI ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు లేకపోవడం, ఇతర ఫ్లాట్ ఫారమ్ లలో ఇది అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా అని భావిస్తోంది వాట్సాప్.
UPI ద్వారా WhatsApp లో అంతర్జాతీయ చెల్లింపుల ఫీచర్ ప్రస్తుతం అభివృద్ది దశలో ఉంది. బీటా వెర్షన్ లో ముందస్తుగా కొందరికి యాక్సెస్ ఉన్నప్పటికీ త్వరలో భారత దేశం మొత్తం యాక్సెస్ ను అందించనుంది.