వాట్సాప్ అప్ డేట్.. కమ్యూనిటీల కోసం గ్రూప్ సజెషన్స్ ఫీచర్‌

 వాట్సాప్ అప్ డేట్.. కమ్యూనిటీల కోసం గ్రూప్ సజెషన్స్ ఫీచర్‌

వాట్సాప్ తన కమ్యూనిటీ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరచేందుకు "గ్రూప్ సజెషన్స్" అనే కొత్త ఫీచర్‌తో యూజర్స్ ను ఆకట్టుకోనుంది. ఈ ఫీచర్ కమ్యూనిటీ అడ్మిన్‌లకు గ్రూప్‌లను సజెస్ట్ చేయడానికి యూజర్స్ కు పర్మిషన్ ఇస్తుంది. ఇది కమ్యూనిటీ సభ్యులకు సంబంధిత గ్రూప్ లను సెర్చ్ చేయడానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. WABetaInfo ప్రకారం, Google Play Store నుంచి ఆండ్రాయిడ్ ( Android) 2.23.14.14 అప్‌డేట్ కోసం WhatsApp బీటాలో గ్రూప్ సజెషన్స్ ఫీచర్ రానుంది.

ఈ ఫీచర్ లో కమ్యూనిటీ అడ్మిన్‌లు ఇతర గ్రూప్ సభ్యులు చేసిన గ్రూప్ సజేషన్స్ ను యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. WABetaInfo ద్వారా షేర్ చేయబడిన స్క్రీన్‌షాట్ ప్రకారం ఈ కొత్త ఫీచర్ అడ్మిన్‌లకు సజేషన్లను త్వరగా  యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేసేందుకు సులభమైన పద్దతిని సూచిస్తుంది. దీంతో పాటు గ్రూప్ ఇన్విటేషన్ కంట్రోల్ లో ఉండేలా గ్రూప్ సభ్యులకు "అడ్మిన్ అప్రూవల్" అనే సెక్యూరిటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచబడుతుంది.

ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు WhatsApp యోచిస్తోంది. గ్రూప్ సజెషన్స్ ఫీచర్‌తో పాటు, అధిక నాణ్యత గల వీడియోలను పంపడానికి యూజర్స్ యాక్సెక్ పొందే కొత్త ఫీచర్‌ను కూడా కంపెనీ పరీక్షిస్తోంది. iOS వెర్షన్ 23.13.0.76, WhatsApp బీటాను ఇన్‌స్టాల్ చేసిన వారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఈ ఫీచర్ అధిక-నాణ్యత వీడియోలను పంపడానికి యూజర్స్ కు అవకాశం కల్పిస్తుంది. ఈ వీడియోల ఒరిజినల్ సైజు విషయంలో ఇంతకుముందున్న నియమాలు ఇప్పటికీ వర్తిస్తాయి. ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ మెరుగైన క్వాలిటీ వీడియోను పంపాలనుకున్న ప్రతిసారీ హై క్వాలిటీ అనే ఆప్షన్ ను మాన్యువల్‌గా ఎంచుకోవలసి ఉంటుంది.