అక్టోబర్ 24 నుంచి Whats App కొన్ని Android, iOS స్మార్ట్ ఫోన్లలో పనిచేయదు. Android OS 5.0 అంతకంటే తక్కువ ఉన్న Android స్మార్ట్ ఫోన్లలో ఇకపై WatsApp పనిచేయదని మెటా ప్రకటించింది. ఫీచర్లు, ఇంటర్ ఫేస్ లను ఎప్పకప్పుడు అప్ డేట్ చేస్తున్నందున ఈ ఫ్లాట్ ఫారమ్ పాత వెర్షన్లలో WatsApp పనిచేయదని తెలిపింది. మీ స్మార్ట్ ఫోన్ లలో ఈ పాత సాఫ్ట్ వేర్ వెర్షన్ లు రన్ అవుతున్నట్లయితే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
WatsApp ఏ స్మార్ట్ ఫోన్లనో పనిచేస్తుందంటే..
OS 5.1, అంతకంటే ఎక్కువ ఉన్న Android ఫోన్లలో పనిచేస్తుంది.
iOS 12, ఆపై ఐఫోన్లలో పనిచేస్తుంది.
Jio Phone,Jio Phone2 తో సహా Ka iOS 2.5.0, అంతకంటే ఎక్కువ ఉన్న ఫోన్లలో పనిచేస్తుంది.
మీ స్మార్ట్ ఫోన్ లో ప్రస్తుత ఉన్న Android OS వెర్షన్ ఇలా చెక్ చేయాలి:
Whats App మీ స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తుందా లేదా అని తెలియాలంటే.. మీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ను తెలుసుకోవాలి. ఫోన్ సెట్టింట్ లోకి వెళ్లి About Phone ఆప్షన్ ద్వారా సాఫ్ట్ వేర్ సమాచారాన్ని తెలుసుకోవాలి. మీ స్మార్ట్ ఫోన్ 5.0 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ లో రన్ అవుతన్నట్టయితే అక్టోబర్ 24 నుంచి మీ స్మార్ట్ ఫోన్ లో Whats App పనిచేయదు.
iOSలో OS ఇలా చెక్ చేయాలి
మీ ఐఫోన్ లో iOS వెర్షన్ చెక్ చేయాలంటే.. సెట్టింగ్ లోకి వెళ్లి About ఆప్షన్ ను నొక్కడం ద్వారా మీ ఐఫోన్ లో ప్రస్తుతం నడుస్తున్న iOS వెర్షన్ ని తెలుసుకోవచ్చు.
Whats App పనిచేయని వెర్షన్లు ఉన్న స్మార్ట్ ఫోన్లకు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని మేసేజ్ పంపిస్తుంది.