డేటాను షేర్ చేయండి లేదా అకౌంట్ డిలీట్.. వాట్సాప్ వార్నింగ్

డేటాను షేర్ చేయండి లేదా అకౌంట్ డిలీట్.. వాట్సాప్ వార్నింగ్
ప్రముఖ ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. యూజర్లు తమ డేటాను ఫేస్‌‌బుక్‌‌తో షేర్ చేయాలని లేదా వారి అకౌంట్లను డిలీట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు అంగీకరించిన వారి అకౌంట్లను కొనసాగిస్తామని లేదా డిలీట్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించిన మెసేజ్‌‌లతో యూజర్లకు అలర్ట్ ఇస్తోంది. యూజర్లు అగ్రీ అనే అలర్ట్ ఆప్షన్ ఇస్తోంది. అగ్రీ చేస్తే వచ్చే నెల 8 నుంచి కొత్త ప్రైవేట్ పాలసీ ఆప్షన్‌‌ను అనుమతించినట్లే. యూజర్ల డేటాను ఫేస్‌‌బుక్‌‌తోపాటు మరికొన్ని యాప్స్, సర్వీసుల్లో షేర్ చేస్తానని వాట్సాప్ తెలపడంపై చాలా మంది యూజర్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవసీ పాలసీ నచ్చనివారు వాట్సాప్ నుంచి క్విట్ అవుతున్నట్లు సమాచారం. New update on privacy policy of WhatsApp be like…#WhatsappPrivacy #Telegram #WhatsappNewPolicy pic.twitter.com/QJUAotFhpe — Zarnain (@Zarnain38710217) January 8, 2021 వాట్సాప్‌‌ను అన్‌‌ఇన్‌‌స్టాల్ చేసి టెలిగ్రామ్‌, సిగ్నల్‌‌‌కు షిఫ్ట్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోందని తెలిసింది. దీనిపై ట్విట్టర్‌‌లో చాలా మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. టెలిగ్రామ్ లాంటి యాప్ వాట్సాప్‌‌కు హానికరం కాదని.. నెట్‌‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌‌స్టార్‌కు పోటీ అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. After new update of WhatsApp privacy policies #Telegram #WhatsappNewPolicy pic.twitter.com/nDem0yzJ85 — Muhammad IRFAN?? (@ir_fan111) January 8, 2021 వాట్సాప్ ప్రైవసీ పాలసీ మార్చిన తర్వాత యూజర్లు టెలిగ్రామ్ వైపు షిఫ్ట్ అవడంపై మరో క్రేజీ మీమ్ వైరల్ అవుతోంది. ఈ మీమ్‌‌లో ఒక అమ్మాయితో నడుస్తున్న వ్యక్తి మరో అమ్మాయి వైపు చూస్తాడు. ఈ క్రేజీ మీమ్స్‌‌ను మీరూ ఓ లుక్కేయండి మరి. Ppl travelling to telegram from Whatsapp:#Telegram pic.twitter.com/TU93TJjDk1 — Jyaa (@LambiMtKren__) January 8, 2021