Whatsapp:వాట్సాప్ యూజర్స్ బీఅలెర్ట్.. క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ కావొచ్చు

Whatsapp:వాట్సాప్ యూజర్స్ బీఅలెర్ట్.. క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ కావొచ్చు

ఇప్పుడు వాట్సాప్ యూజర్లను వణికిస్తున్న ఒకేఒక్క భయం జీరోక్లిక్.. ఖాతా హ్యాక్ అయ్యేందుకు ఎటువంటి యూజర్ చర్య అవసరం లేదు. మీ స్మార్ ఫోన్లు ఎటువంటి లింక్ క్లిక్ చేయకుండానే హ్యాక్ కావొచ్చు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్త మెటా స్వయంగా ధృవీకరించింది. హ్యాకర్లు వాట్సాప్ ప్లాట్ ఫాం ను లక్ష్యంగా చేసుకున్నారని, నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. 

కనీసం 24 దేశాలలో మిలియన్ల మంది whatsapp  కస్టమర్లపై  స్పైవేర్ దాడి జరుగుతోందని మెటా తెలిపింది. ఇటలీలో ఇప్పటికే ఏడు కేసులు నిర్ధారించామని వెల్లడించింది. 
వాట్సాప్ రిపోర్టు ప్రకారం.. ఇజ్రాయెట్ నిఘా సంస్థ అనుసంధానించబడిన స్పైవేర్ ను జర్నలిస్టులు, కార్యకర్తు ల, పౌర సమాజ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఉపయోగిస్తున్నారు. జీరో క్లిక్ హ్యాకింగ్ వాడకంతో కస్టమర్ ప్రమేయం లేకుండానే, ఏ లింక్ పై క్లిక్ చేయకుండానే స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేయొచ్చు. 
ఇటలీలో మెసేజింగ్ ప్లాట్ ఫాం ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ధృవీకరించింది మెటా. ఇటలీలో అనేక మంది వ్యక్తులపై స్పైవేర్ ఉపయోగించబడిందని, ఇటలీ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని అప్రమత్తం చేసింది.