
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవేట్ పాలసీని అప్‌డేట్ చేసింది. దీంట్లో భాగంగా టర్మ్స్ అండ్ ప్రైవేట్ పాలసీల్లో కొన్ని మార్పులు చేసింది. ఈ విధివిధానాలు వచ్చే నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త టర్మ్స్‌ను యాక్సెప్ట్ చేయని వారు తమ అకౌంట్లను డిలీట్ చేసే విధంగా ఆప్షన్‌ను క్రియేట్ చేసింది. వాట్సాప్‌లో వచ్చిన కొత్త అప్‌డేట్‌లో యూజర్ డేటా గురించే ఎక్కువగా ఉంది. బుధవారం వాట్సాప్‌ను ఓపెన్ చేయగానే పాప్ అప్ మెసేజ్‌ను చూయిస్తోంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాప్‌ను యథావిధిగా వాడుకోవచ్చు.
ఒకవేళ కొత్త టర్మ్స్ నచ్చకపోతే, యాక్సెప్ట్ చేయకుంటే మాత్రం అకౌంట్ డిలీట్ ఆప్షన్ చూయిస్తోంది. దీని గురించి ఇతర వివరాలు తెలుసుకోవాలనుకంటే హెల్ప్ సెంటర్ ఆప్షన్‌లో అన్ని వివరాలను ఉన్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో వాట్సాప్ షేర్ చేస్తోందని సమాచారం.