సూపర్ ఫీచర్ : వాట్సాప్ నుంచి నేరుగా ఇన్ స్టాకు షేరింగ్

సూపర్ ఫీచర్ : వాట్సాప్ నుంచి నేరుగా ఇన్ స్టాకు షేరింగ్

వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తో యూజర్స్ ను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకునేలా ఓ సరికొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్, తాజా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఇది వాట్సాప్ లో పోస్ట్ చేసిన స్టేటస్ ను వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేసుకునేందుకు షార్ట్‌కట్‌ను సూచిస్తుంది.

రోజుకో కొత్త ఫీచర్ తో యూజర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చేందుకు, సేవలను మరింత మెరుగుపర్చేందుకు వాట్సాప్ ఈ ఫీచర్ ను తీసుకు రానుంది. WABetaInfo నుండి వచ్చిన బజ్ ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో మీ స్టేటస్ అప్‌డేట్‌లను వెంటనే షేర్ చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్ పని చేయనుంది. మీరు వాట్సాప్‌లో స్టేటస్‌ని పోస్ట్ చేసిన తర్వాత, అదే స్టేటస్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయమని చూపించేలా ఓ ఈజీ షార్ట్‌కట్ పాపప్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. మీరు ఈ ఫీచర్‌ని మీ యాప్ సెట్టింగ్‌లలో ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మీకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇది ఇస్తుంది.

మీరు షేర్ చేయాలకున్నప్పుడు, Instagramలో దాన్ని ఎవరు చూడాలో కూడా ఎంచుకోవచ్చు. ఇది మీ షేరింగ్ ప్రియారిటీ ప్రాధాన్యతలపై నియంత్రణను కలిగి ఉండటమే.  ఈ అప్ డేట్ తో ఏకకాలంలోనే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో.. రెండింటిలోనూ అప్ డేట్స్ ఇవ్వొచ్చు.