మెసేజింగ్ యాప్ ..వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు టెక్ట్స్ మెసేజ్‌లను మాత్రమే సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని పంపేవాళ్లం. కానీ ఈ సౌలభ్యం వాయిస్ మెసేజ్‌లకు లేదు. ఒకసారి రికార్డు చేసిన తర్వాత.. పంపడమో, లేక డిలీట్ చేయడమో మాత్రమే చేయాల్సి ఉంటుంది. రికార్డు చేసింది.. కరెక్ట్ గా ఉందో లేదో సెండ్ చేయక ముందు వినే అవకాశం లేదు. పంపిన తర్వాతే వినాలి. కానీ ఇప్పుడు వాయిస్ మెసేజ్ లను సెండ్ చేయకముందే అది కరెక్టుగా ఉందో లేదో వినే ఫీచర్ ను వాట్సాప్ తీసుకురానుంది. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌లలో వినే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్‌లను సెండ్ చేసేప్పుడు ‘రివ్యూ’ బటన్ తో వినేలా వాట్సాప్ ఓ ఫీచర్ తెస్తోంది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ తీసుకురానుంది.