వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్..వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ను అప్డేట్ చేసింది. ఆడియో సహా స్క్రీన్ షేరింగ్, న్యూ స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ అప్డేట్ తో వాట్సాప్ గ్రూప్ వీడియోకాల్లో 32 మందికి ఒకేసారి స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఇంతకుముందు గత సంవత్సరం వాట్సాప్ వీడియోలను స్క్రీన్ షేరింగ్ చేసేందుకు సపోర్టింగ్ ఫీచర్ ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఆప్డేట్ తో వీడియోతోపాటు ఆడియోను కూడా షేర్ చేయొచ్చు. ఇది వాట్సాప్ కాల్ లో ఉన్న వారంతా వీడియాను ఆడియోతో సహా చూసేందుకు అనుమతిస్తుంది. వీడియో కాలింగ్ లో పాల్గొనేవారు డెస్క్ టాప్ లేదా మొబైల్ ఉపయోగిస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా..వర్చువల్ మీటింగ్స్, ఆన్ లైన్ క్లాసెస్ లకు ఈ అప్డేట్ సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు వాట్సాప్ స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్ కూడా ఉంది.
వాట్సాప్ స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్..
ఈ ఫీచర్ గ్రూప్ కాల్స్ సంభాషణలను మ్యానేజ్ చేసేందుకు సాయపడుతుంది. వ్యక్తి మాట్లాడేటప్పుడు దానంతట అదే మాట్లాడుతున్న వ్యక్తిని స్క్రీన్పై హైలైట్ చేసి చూపిస్తుంది. ఇది చర్చను అనుసరించేందుకు ఇతరులకు సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు ఆడియో, వీడియో క్వాలిటీ పై కూడా దృష్టి పెట్టింది వాట్సాప్. ఇటీవల పరిచయం చేసిన MLow codec వీడియో కాల్ క్వాంటిటీని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా మొబైల్ యూజర్లకు బెటర్ నాయిస్, ఎకో క్యాన్సలేషన్ ను అందిస్తుంది. ఫలితంగా గందరగోళ వాతావరణంలో కూడా చక్కటి కాల్స్ ను అందిస్తుంది.
ఈ అప్డేట్ లతో వాట్సాప్ కాలింగ్ ఫీచర్ల అభివృద్ధి కొనసాగిస్తుందనడంతో తన నిబద్ధతను చాటుకుంది. యూజర్లు గ్రూప్ చాటింగ్ లో ఉన్నా.. ఇంట్లోవారితో మాట్లాడు తున్నా, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేస్తున్నా .. వాట్సాప్ బెస్ట్ కాల్స్ ను అందించే లక్ష్యంగా పెట్టుకుంది. తాజా అప్డేట్ లో అత్యంత మెరుగైన వీడియో కాల్స్ ను అందిస్తుం ది. హై క్వాలిటీ కాల్స్ ను యూజర్లు అందుకునేందుకు హామీ ఇస్తుంది ప్రాంతమేదైనా..అది దేశమైనా.. విదేశమైనా..