WhatsApp ..ఆండ్రాయిడ్ Share near by, యాపిల్ Air Drop మాదిరిగానే షేరింగ్ సిస్టమ్ ను పరిచయం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులను ఫైల్స్ సజావుగా మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వాట్సాప్ నియర్ బై షేర్ వెర్షన్ తో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ ఫైళ్లను పంపడానికి, స్వీకరించడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ఫైల్ బదిలీ సాధారణం గా రెండు డివైజ్ ల మధ్య బ్లూటూత్ కనెక్టివిటీ సాయంతో పనిచేస్తుంది. WhatsApp ఇదే ఛానెల్ తో వెళ్తోంది.
Wabetainfo ప్రకారం..WhatsAppలో రాబోయ ఫైల్ షేరింగ్ ఫీచర్ Android కు చెందిన Nearby Share ఫీచర్, Apple కు చెందిన AirDrop ఫీచర్ ను పోలి ఉంటుంది. అయితే ఇది ఇంకా డెవలప్ మెంట్ దశలో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.2.20 కోసం WhatsApp బీటాలో ఆవిష్కరణ జరిగింది.