వాట్సాప్..ఇప్పుడు ఈ యాప్ గురించి తెలియని వారు లేరు. ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో షేర్ చేయొచ్చు. ఆడియో ఫైల్స్ ని కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు. వాట్సాప్ వాడని స్మార్ట్ఫోన్ యూజర్ లేడంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల కాలంలో మెసేజింగ్ యాప్ విషయంలో రూల్స్ను సవరించింది కేంద్రం. దీనిపై వాట్సాప్,ఫేస్ బుక్లు కోర్టుకెక్కాయి.ఈ కేసులో కోర్టు ముందు హాజరైన వాట్సాప్.. ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయాలని ఆదేశాలిస్తే భారత్లో తమ కార్యకలాపాలు నిలిపివేస్తామని కోర్టుకు తెలిపింది.
మెసేజ్లు, కాల్స్కు సంబంధించిన ఎన్క్రిప్షన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఎదుట తన వాదనలు వినిపింది. కొత్త ఐటీ రూల్స్, ప్రైవసీ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ వాట్సాప్తో పాటు మరో మెటాకు చెందిన సోషల్ మీడియా ఫేస్బుక్ కూడా కోర్టులో కేసు వేసింది. ఈ మేసేజింగ్ యాప్లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కింద మెసేజ్లను ట్రేస్ చేయడానికి అనుమతివ్వాలని భారత ప్రభుత్వం పదే పదే క్లెయిమ్ చేస్తుందని..చాట్ల ఎన్క్రిప్షన్ బ్రేక్ సాధ్యం కాదని వాట్సాప్ కోర్టుకు తెలిపింది. చాట్స్ని ట్రేస్ చేయాని మేసేజింగ్ యాప్స్కి చెప్పడం అనేది వాట్సాప్లోని ప్రతి మేసేజ్ ని చూడటమే. అది మా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్సన్ పాలసీకి విరుద్ధమని వాట్సాప్ తెలిపింది. ప్రజల ప్రైవసీ హక్కులకు ఇది విరుద్ధం చెప్పకొచ్చింది.
ఈ పిటిషన్లను భారత దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వ్యతిరేకింది. వివాదాలు ఎదురైతే వాటిని పరిష్కరించే విషయంలో వాట్సాప్ ప్రాథ మిక హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టుకు తెలిపింది. ఈ కొత్త రూల్స్ ని అమలు చేయకపోతే.. ఫేక్ మేసేజ్ లను నియంత్రించడం కష్టమవుతుందని పేర్కొంది. ఇలాంటి మేసేజ్ లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది.
కొత్త రూల్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఫ్రేమ్ వర్క్ ని సిద్ధం కేంద్రం సిద్ధం చేసింది. మేసేజ్ మొదట ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు వంటి విషయాలను సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్స్ కేంద్రానికి తెలపాలని ఆ రూల్స్ లో ఉంది.