ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నరు. తమకు తెలిసిన సమాచారాన్ని, ఇతరత్రా వివరాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్కుంటున్రు. అందరూ ఉపయోగించే కామన్ మెసేజింగ్ అప్లికేషన్‌గా వాట్సాప్ ను ఉపయోగిస్తున్రు. సేవలను మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్ ను అప్ డేట్ చేస్తాంది. ఈక్రమంలో కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయినయ్. డిసెంబర్ 31 నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్లల WhatsApp పని చేయడం ఆగిపోతదట. ఈవిషయాన్ని స్వయంగా వాట్సాప్ కంపెనీయే ప్రకటించింది. దాదాపు 49 స్మార్ట్ ఫోన్ మోడళ్లల వాట్సాప్ పని చేయదట. ఈ ఫోన్ మోడళ్లల చాలావరకు పాత వర్షన్లవే ఉన్నయి. ఇప్పటికీ ఈ ఫోన్లను వాడుతున్న వారు కొత్త ఫోన్ కొనుక్కోవడం బెటర్ అని అంటున్రు.
- ఆపిల్ ఐఫోన్ 5
- ఆపిల్ ఐఫోన్ 5c
- ఆర్కోస్ 53 ప్లాటినం
- హువాయ్ అసెండ్ డీ
- హువాయ్ అసెండ్ డీ1
- హువాయ్ అసెండ్ డీ2
- హువాయ్ అసెండ్ జీ740
- హువాయ్ అసెండ్ మేట్
- హువాయ్ అసెండ్ పీ1
- క్వాడ్ ఎక్స్‌ఎల్
- లెనెవో ఏ820
- ఎల్‌జీ ఎనాక్ట్
- ఎల్‌జీ లుసిడ్ 2
- ఎల్‌జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3 క్యూ
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్5
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్6
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్7
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్2 II
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 II
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 3 డ్యూయల్
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్4 II
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 4 II డ్యూయల్
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 డ్యూయల్
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 II
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7 II
- ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్5 II డ్యూయల్
- ఎల్‌జీ ఆప్టిమస్ నైట్రో హెచ్‌డీ
- మెమో జెడ్‌టీఈ వీ956
- సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 2
- సామ్‌సంగ్ గెలాక్సీ కోర్
- సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2
- సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 మిని
- సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ II
- సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
- సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 2
- సామ్‌సంగ్ గెలాక్సీ
- సోనీ ఎక్సీపీరియా ఆర్క్ ఎస్
- సోనీ ఎక్సీపీరియా మైరో
- సోనీ ఎక్సీపీరియా నియో ఎల్
- వికో కిక్ ఫైవ్
- వికో డార్క్‌నైట్ జెడ్‌టీ