నవంబరు నుంచి ఈ మొబైల్స్ లో వాట్సాప్ సేవలు బంద్

నవంబరు నుంచి ఈ మొబైల్స్ లో వాట్సాప్ సేవలు బంద్

ప్రస్తుతం అందరూ ఉపయోగించే సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ సంస్థ ఏటా తమ సేవలు నిలిపివేసే పాత మొబైల్ మోడల్స్ వివరాలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఆ జాబితాను వాట్సాప్ తెలిపింది. ఈ ఏడాది నవంబరు 1 నుంచి జాబితాలోని మొబైల్‌్గలో వాట్సాప్ సెక్యూరిటీ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉండబోవని తెలిపింది.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4.0.3, IOS 9, కై 2.5.1 వెర్షన్ OSలు.. వీటికి ముందు తరం OSలతో పనిచేసే మొబైల్స్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే వాట్సాప్ విడుదల చేసిన లిస్టులో యాపిల్ ఐఫోన్‌తో పాటు శాంసంగ్, ఎల్‌జీ, జడ్‌టీఈ, హువాయ్, సోనీ, హెచ్‌టీసీ తదితర బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి.