సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వాట్సప్ డీపీగా ఫోటోలు మాత్రమే పెట్టుకునే అవకాశముండగా.. త్వరలోనే యూజర్లు సొంతంగా యానిమేటెడ్ అవతార్స్ రూపొందించుకుని డీపీలుగా పెట్టుకునే వీలు కల్పించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని డబ్ల్యూఏబేటాఇన్ఫో సంస్థ వెల్లడించింది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు నచ్చిన అవతార్స్ను డీపీగా పెట్టుకునే అవకాశం కలుగుతుంది. వీడియో కాల్స్ చేసినప్పుడు యూజర్లు తమ ముఖం కాకుండా యానిమేటెడ్ అవతార్లు కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకునే అవకాం వీలు కల్పించేందుకు వాట్సప్ ప్రయత్నిస్తోంది. వీటితో పాటు బ్యాక్ గ్రౌండ్ కలర్ ను మార్చుకునేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది.
ఇదిలా ఉంటే వాట్సప్ యూజర్లు గ్రూపుల్లోంచి ఎవరికీ తెలియకుండా ఎగ్జిట్ అయ్యే ఫీచర్ ను తీసుకురానున్నట్లు మెటా ఇప్పటికే ప్రకటించింది. అలాగే యూజర్ ఆన్ లైన్లో ఉన్న విషయాన్ని ఎంపిక చేసిన వారు మాత్రమే చూసేలా మార్పులు చేయనున్నారు. దీంతో పాటు వ్యూ వన్స్ మెసేజెస్ ను స్క్రీన్ షాట్ తీయకుండా ఉండే ఫీచర్కు సంబంధించి ప్రయోగాత్మక పరిశీలన జరుగుతున్నాయని మెటా ప్రకటించింది.