
చాలా రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ దాదాపు అందరూ వాడేది మాత్రం వాట్సాప్ అన్నది అందరికీ తెలిసిందే.. మెసేజింగ్ రంగంలో నంబర్ వన్ గా ఎదిగిన వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ యూజర్లకి బెస్ట్ ఎక్సపీరియన్స్ ఇచ్చేందుకు కృషి చేస్తోంది. ఇదిలా ఉండగా.. మెసేజ్ త్రెడ్స్ అంటూ మరో కొత్త అప్డేట్ తెచ్చేందుకు సిద్ధమైంది వాట్సాప్. గ్రూప్ చాట్స్ ను, పర్సనల్ చాట్స్ ను మరింత ఎఫెక్టివ్ గా చేసేందుకు ఈ అప్డేట్ తెస్తోంది వాట్సాప్.
ALSO READ | ఓలా స్కూటర్లపై రూ.26,750 వరకు డిస్కౌంట్
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ద్వారా ఒక మెసేజ్ కి ఇచ్చిన రిప్లైస్ అన్నిటిని ఒకే చోట చూసే వీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ గ్రూప్ చాట్స్ లో కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసే వీలు ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్స్ లో ఏ మెసేజ్ కి రెప్లైస్ అన్ని ఒకే చోట పాప్ అప్ స్క్రీన్ లో కనిపించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లందరికి ఉపయోగపడే, టైం సేవ్ చేసే ఫీచర్ అనే చెప్పాలి.
Also Read : తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాల విడుదల..
ప్రస్తుతం బీటా వర్షన్ లో లిమిటెడ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అన్ని వర్షన్స్ కి అందుబాటులోకి రానుంది.