వినియోగదారుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యం అని చెప్పిన వాట్సప్ అందుకు తగినట్లే వారి కోసం విభిన్న ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో భాగంగా "లాక్ చాట్" అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వ్యక్తిగత గోప్యతను పెంచడానికి, నిర్దిష్ట చాట్‌ను లాక్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌ని నిర్దిష్ట వాట్సప్ బీటా టెస్టర్లు ఉపయోగించగలరు. మొత్తం యాప్‌ని లాక్ చేయకుండానే ఒక నిర్దిష్ట చాట్‌ను గోప్యంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. బీటా వినియోగదారులు ఫీచర్‌ని పొందాలంటే.. వాట్సప్ ప్రొఫైల్ విభాగానికి వెళ్లండి. కిందకు స్ర్కోల్ చేసి "చాట్‌లాక్" పై నొక్కండి. తర్వాత "లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్" ఆప్షన్‌ని ఎనేబుల్ చేయండి.
త్వరలో అందుబాటులోకి..
వాట్సప్ తెచ్చిన ఈ అప్ డేట్ త్వరలో ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ కొన్ని చాట్లను దాచేందుకు వాట్సప్‌ని లాక్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.