
WhatsApp ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగిస్తున్న మేసేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా 3.5మిలియన్ల యూజర్లున్నారు. మార్గ్ జుకెర్ బర్గ్ మెటాసంస్థ కు చెందిన ఈ యాప్ యూజర్లకు మెరుగైన సర్వీస్ అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. తాజాగా ఓ కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. ఈ ఫీచర్ డేటా వినియోగంతో విసిగిపోయిన వారికి గేమ్ ఛేంజర్ ఉండబోతోంది.
నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోటోలు,వీడియోలను షేర్ చేసేందుకు WhatsApp కు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, స్కూల్ గ్రూప్స్, వర్క్ గ్రూప్ లలో మీడియా ఫైల్స్ పంపించేందుకు వినియోగిస్తుంటాం.అయితే ఆటో-డౌన్‌లోడ్ ఆన్ చేసినప్పుడు ఈ మీడియా ఫైల్‌లు - పరిమాణం,ప్రాధాన్యతతో సంబంధం లేకుండా డేటా అయిపోతుంటుంది. ఇప్పుడు ఫోటోలు,వీడియోలు ఆటో డౌన్‌లోడ్ చేయబడే నాణ్యతను నియంత్రించేందుకు కస్టమర్లను అనుమతించే ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటే ఇప్పుడు ప్రతి మీడియా ఫైల్‌ను అధిక రిజల్యూషన్‌లో డౌన్‌లోడ్ చేయకుండా కస్టమర్ కు నచ్చిన రెజల్యూషన్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ డేటా ,స్టోరేజ్ ప్లేస్ రెండింటినీ ఆదా చేస్తుంది.
Also Read:-యాత్రికులే లక్ష్యంగా ఆన్లైన్ మోసాలు.. ఇలా చేస్తే ఫ్రాడ్స్టర్లకు చిక్కినట్టే
కొత్త ఫీచర్ WhatsApp బీటా వెర్షన్ 2.25.12.24 లో అందుబాటులో ఉంది. అధిక-నాణ్యత ఫొటోలు, వీడియోలను WhatsApp ఆటో మేటిక్ గా కంప్రెస్డ్ వెర్షన్‌ను సృష్టిస్తుంది. మీ ఆటో-డౌన్‌లోడ్ సెట్టింగ్ ద్వారా పంపినవారు ఫైల్‌ను అధిక నాణ్యతతో షేర్ చేసినా వాటిని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
డేటా, స్టోరేజీ నియంత్రణకు బెస్ట్ వన్..
ప్రస్తుతం వాట్సాప్ ఆటో-డౌన్‌లోడ్ సెట్టింగ్ ఫైల్‌లను అవి పంపిన నాణ్యతతో డౌన్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంది. ఫలితంగా మొబైల్ డేటా అనవసరంగా వినియోగించబడుతుంది. కొత్త ఫీచర్ తో కస్టమర్లు వారికి అవసరమైన రెజల్యూషన్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా గ్రూప్ చాట్ చేసేవారికి ఎక్కువ ఉపయోగం. గ్రూప్ చాట్ లలో తరచుగా చాలా అన్ వాంటెడ్ ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి. తక్కువ- రెజల్యూషన్ వెర్షన్‌లకు డౌన్‌లోడ్‌లను పరిమితం చేయడం ద్వారా కస్టమర్ల డేటా యూసేజ్ తగ్గించుకోవచ్చు. స్టోరేజ్ కూడా త్వరగా నిండిపోకుండా చూసుకోవచ్చు.