ఏపీ మంత్రి అంబటి రాంబాబు కారుపై పడిన గోధుమ బస్తాలు.. తప్పిన ప్రమాదం

 ఖమ్మం: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లలో అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై లారీ నుంచి బస్తాలు జారి పడ్డాయి. ఈ ప్రమాదంలో అంబటి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతిన్నది.  

లారీ రాజమండ్రి నుంచి ఖమ్మం వైపు గోథుమల లోడ్ తో వెళ్తోంది. రన్నింగ్ లో ఉండగా బస్తాలు అంబటి కారుపై పడ్డాయి. దీంతో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. అంబటి రాంబాబు ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. కాన్వాయ్ లోని మరో కారులో అంబటి రాంబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.