బాలకృష్ణ లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా మూవీ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj). జనవరి 12న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో రూ.156కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో మోస్తారు కలెక్షన్స్ తో రాణిస్తుంది. ఈ క్రమంలో డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్డేట్ పై రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేద్దాం.
డాకు మహారాజ్ ఓటీటీ:
బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ రూ.25 కోట్లకు పైగా వెచ్చించిందని సమాచారం.
అయితే, ఈ మూవీ థియేటర్ లాంగ్ రన్ కంప్లీట్ అవుతుండటంతో ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు టాక్. దాదాపు ఈ తేదీనే డాకు మహారాజ్ స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని రూమర్లు వినిపిస్తోన్నాయి. త్వరలో డాకు మహారాజ్ స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
డాకు మహారాజ్ వసూళ్లు:
డాకు మహారాజ్ రిలీజైన బాక్సాఫీస్ ధమాఖా చూపించింది. బాలకృష్ణ కెరీర్లో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో చిత్రంగా నిలిచింది. అంతకుముందు వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల తర్వాత వంద కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్ చేరింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో రూ.156కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇకపోతే ఈ మూవీ 15 రోజుల్లో రూ.86.95కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.