OTT Thriller: ఓటీటీకి తమిళ లేటెస్ట్ హైప‌ర్‌లింక్ థ్రిల్ల‌ర్ మూవీ.. నాలుగు క‌థ‌లతో అదిరిపోయే ట్విస్ట్‌లు

తమిళ లేటెస్ట్ హైపర్ లింక్ థ్రిల్లర్ మూవీ 'వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మ‌ద్రాస్'(Once Upon a Time in Madras). ప్రసాద్ మురుగన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 13, 2024న థియేటర్‌లలో విడుదలైంది. ఇందులో భరత్, పవిత్ర లక్ష్మి మరియు అభిరామి ముఖ్య పాత్రల్లో నటించారు.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇపుడీ ఈ మూవీ నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. నాలుగు క‌థ‌లతో అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగే ఈ థ్రిల్లర్ ఆహా త‌మిళ్ ఓటీటీలో జనవరి 17నుంచి స్ట్రీమింగ్కి రానుంది.

కథేంటంటే:

ఈ సినిమా కథ నలుగురి వ్యక్తుల జీవితాలతో నడుస్తుంది. ఓ గ‌న్ వీళ్ళ జీవితాలని ఎలా తలక్రిందులు చేసిందనే కోణంలో సినిమా రూపొందింది. రాజా (భ‌ర‌త్‌) భార్య అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంది. ఆమె ట్రీట్‌మెంట్ కోసం భారీగా డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. ఆ డ‌బ్బు కోసం క్రైమ్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట‌ర్ అవుతాడు రాజ్‌.అందుకు రాజ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. 

లోన్ ఏజెంట్ బారి నుంచి త‌న కూతురిని కాపాడుకోవాల‌ని సావిత్రి (అభిరామి) ఫిక్స‌వుతుంది. ఇందుకోసం ఆమె ఏం చేసిందనేది మ‌రో క‌థ‌గా సాగుతోంది.

అలాగే రంగరాజ్ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి సుదర్శన్ అనే బాలుడిని కాల్చి చంపడం. ఆ గన్ ని నదిలో పారవేయడం.. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించడంలో పోలీసుల విచారణ ఓ కథగా సాగుతోంది.

అలాగే మధి అనే నవ వధువు తన భర్త రహస్యాన్ని తెలుసుకుని అత్తమామలపై ఎలా హింసాత్మక చర్య తీసుకుంటుందని మరో కథగా చెప్పబడింది. ఇకపోతే.. వీరి నలుగురు జీవితాలు ఒక తుపాకీతో ముడిపడి ఉంటాయి. ఆ ఒక్క తుపాకీ.. వ్యక్తి నుండి వ్యక్తికి బదిలీ చేయబడి, చెన్నైలోని అనేక మంది వ్యక్తుల జీవితాలను నాటకీయంగా ఎలా మారుస్తుందనేది సినిమా కథ.