Anuja OTT: ఓటీటీలోకి ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్.. అనూజ స్ట్రీమింగ్ వివరాలివే

Anuja OTT: ఓటీటీలోకి ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్.. అనూజ స్ట్రీమింగ్ వివరాలివే

2025 ఆస్కార్ అవార్డులో అనూజ (Anuja) షార్ట్ ఫిల్మ్​ 'బెస్ట్​ లైవ్​యాక్షన్​ షార్ట్​ ఫిల్మ్' కేటగిరీలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 22 నిమిషాల నిడివి గల ఈ షార్ట్‌‌ ఫిల్మ్‌‌ బాల కార్మికుల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఇపుడీ ఈ మూవీ స్ట్రీమింగ్కి సిద్దమైంది.

అనూజ ఓటీటీ

ప్రియాంకా చోప్రా నిర్మించిన అనూజ హిందీ షార్ట్ ఫిల్మ్ బుధవారం (ఫిబ్రవరి 5న) ఓటీటీలోకి రానుంది. అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఓటీటీలోకి వస్తుండటంతో ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది.

ALSO READ | పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత రూట్ మార్చేసిందిగా..

ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ యొక్క అధికారిక Xలో రిలీజ్ డేట్ని ప్రకటించింది. "అనుజా అనేది స్థితిస్థాపకత, సోదరభావం మరియు వారి ఆశల జీవితాల యొక్క కథ ఇది. అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఫిబ్రవరి 5న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది" అంటూ పోస్ట్ చేసింది.

ఈ షార్ట్​ ఫిల్మ్​ను ప్రియాంకా చోప్రా, గునీత్​ మోంగా నిర్మించగా, ఆడమ్​జే గ్రావ్స్​ దర్శకత్వం వహించారు. గునీత్​ మోంగాకు ఇది మూడో ఆస్కార్​ఎంట్రీ. ఇంతకుముందు నిర్మించిన ది ఎలిఫెంట్​ విస్పర్స్, పీరియడ్: ఎండ్​ఆఫ్​ సెంటెన్స్​ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి.

అనూజ కథ:

అనూజ చిత్రంలో బాల కార్మికుల జీవితాల్లోని చీకటి కోణాన్ని ఆవిష్కరించారు. దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేసే అనూజ అనే 9 ఏండ్ల బాలిక, ఆమె అక్క పాలక్​ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు జీవితాన్ని మార్చే నిర్ణయాన్ని వీరు ఎంత చాకచక్యంతో తీసుకున్నారనేది ప్రధాన కథగా చెప్పబడింది.