Dragon OTT: అఫీషియల్.. ఓటీటీలోకి బ్లాక్‍బస్టర్ డ్రాగన్.. తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఇదే

Dragon OTT: అఫీషియల్.. ఓటీటీలోకి బ్లాక్‍బస్టర్ డ్రాగన్.. తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఇదే

తమిళ సూపర్ టాలెంటెడ్ నటుడు అండ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan).లేటెస్ట్గా ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ (Dragon) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఫిబ్రవరి 21న థియేటర్స్కి వచ్చిన డ్రాగన్..వరల్డ్ వైడ్గా రూ. 100 కోట్ల గ్రాస్ దాటి రూ.150 కోట్ల దిశగా లాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ ఓటీటీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

డ్రాగన్ ఓటీటీ:

డ్రాగన్ మూవీ మార్చి 21 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇవాళ (మార్చి 18న) నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.  "కొన్ని డ్రాగన్లు అతిగా కోప్పడవు. ఎందుకంటే వాటి కమ్‍బ్యాక్ చాలా హాట్‍గా ఉంటుంది. మార్చి 21న డ్రాగన్ చిత్రం తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వస్తోంది" అని నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ సినిమా రిలీజైన సరిగ్గా నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తుండటం విశేషం.

మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాలేజీ లైఫ్, జాబ్ లైఫ్ ని బేస్ చేసుకుని రాసిన సీన్స్ యూత్ ని కట్టి పడేశాయి. దీంతో తమిళ్ తో పాటూ తెలుగులో కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టింది.

Also Read:-లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి..

ఈ సినిమాకి ఓరి దేవుడా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ప్రదీప్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్స్గా నటించారు. KS రవి కుమార్, గౌతం వాసుదేవ్ మీనన్, మిస్కిన్, కయదు లోహర్, మరియం జార్జ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ మూవీని ఎజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై కల్పాతి అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ సంయుక్తంగా నిర్మించారు.