రైటర్ కం డైరెక్టర్స్ ఆర్జే బాలాజీ, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ సొర్గవాసల్ (Sorgavaasal). సిద్దార్ద్ విశ్వనాథన్ దర్శకుడు. ఈ మూవీ నవంబర్ 29న రిలీజై విమర్శకుల ప్రసంశలు అందుకుంది.
ఈ జైలు డ్రామాలో RJ బాలాజీతో పాటు సానియా అయ్యప్పన్, నటరాజన్ సుబ్రమణ్యం, షరాఫ్ యు ధీన్, బాలాజీ శక్తివేల్ మరియు రవి రాఘవేంద్ర కీలక పాత్రల్లో నటించారు.
సొర్గవాసల్ ఓటీటీ:
1999 మద్రాస్ సెంట్రల్ జైలు అల్లర్ల ఆధారంగా సినిమా రూపొందింది. చేయని నేరానికి జైలు శిక్షించబడిన వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఇపుడీ ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. డిసెంబర్ 27 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానునట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Indha vaasal thorandha sorgam theriyuma? Illa naragama? December 27 anniku, Sorgavaasal thorakkudhu. Paakalama?
— Netflix India South (@Netflix_INSouth) December 23, 2024
Watch Sorgavaasal on Netflix, out 27 December#SorgavaasalOnNetflix pic.twitter.com/Ldw2kz6XcB
సొర్గవాసల్ కథేంటంటే::
అవినీతి వ్యవస్థలో ఖైదు చేయబడిన ఒక సామాన్యుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. జైళ్లు నిజంగా పునరావాసం కల్పిస్తాయా లేదా నేరాల అగాధంలోకి వ్యక్తులను లోతుగా నెట్టివేస్తాయా అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు.
చెన్నై నగరంలో రోడ్‍సైడ్ చిన్న ఫుడ్ బిజినెస్ చేస్తుంటాడు పార్థిబన్ అలియాజ్ పార్థి (ఆర్జే బాలాజీ). ఎలాగైనా తాను ఒక పెద్ద హోటల్ పెట్టాలని అనుకుంటాడు. అలాగే రేవతి (సానియా అయ్యప్పన్)ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు. ఇక ఈ క్రమంలో తన పార్థి ఫుడ్ సెంటర్ వద్ద రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ షణ్ముగం చనిపోతాడు. దీంతో ఆ మర్డర్ కేసు పార్థిబన్ మీద పడుతుంది. ఇక చేయని నేరానికి జైలుకెళ్ళాల్సి వస్తోంది. అక్కడ ఎన్నో కష్టాలు పడతాడు. అంతేకాకుండా బయటకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
ALSO READ | Anupama Parameswaran: పరదాలో అనుపమ.. వరుస సినిమాలు చేస్తోన్న మలయాళ కుట్టి
అక్కడ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ (షరాఫుద్దీన్) లాంటి అవినీతి అధికారులు ఉంటారు. ఆ జైలులో సగా (సెల్వరాఘవన్), కెండ్రిక్ (సామ్యూల్) మధ్య గొడవలు తరుచుగా జరుగుతుంటాయి. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల జైలులో జరిగే అల్లర్లలో భాగమవుతాడు పార్థిబన్. ఈ అల్లర్లపై విచారణ జరిపేందుకు ఆఫీసర్ ఇస్మాయిల్ (నటరాజ్) జైలుకి వస్తాడు.
ఆ తర్వాత జైలులో ఎలాంటి నిజాలు బయటపెట్టాడు? ఇందులో నుంచి పార్థి అసలు బయటకి వచ్చాడా? లేదా? అల్లర్ల విషయంలో ఎలాంటి సంచలన విషయాలు తెలిశాయి. ముఖ్యంగా జీవితంలో రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి 'స్వర్గంలో మోకరిల్లండి' లేదా 'నరకంలో రాజుగా ఉండండి' అనే విషయం ఎలా చెప్పబడుతుంది? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ షణ్ముగం ఎలా చంపబడ్డాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే