Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

తమిళ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది స్మైల్ మ్యాన్ (The Smile Man). ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌స్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో శరత్‌కుమార్ (Sarath Kumar) నటించిన ది స్మైల్ మ్యాన్ చిత్రం డిసెంబర్ 27, 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి శ్యామ్‌-ప్రవీణ్‌ జంటగా దర్శకత్వం వహించారు.

ది స్మైల్ మ్యాన్ ఓటీటీ:

ది స్మైల్ మ్యాన్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకులు రాసుకున్న కథకు ధీటుగా స్క్రీన్‌ప్లేను అందించి సక్సెస్ అయ్యారు. ఎలాంటి క్లూస్ లేకుండా సీరియల్ కిల్లర్ చేసే వరుస హత్యలు సినిమాపై ఆసక్తి పెంచుతుంది. అలా అంతు చిక్కని చిక్కులతో కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసుల వేసే ఎత్తుగడలు ఆడియన్స్ మైండ్ కి పదును పెట్టేలా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు, అది సినిమాను బాక్సాఫీస్ దగ్గర కాపాడలేకపోయింది. దీంతో ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వ‌స్తోంది. జనవరి 24 నుంచి ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. OTTplay ప్రీమియం యాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది.  

ALSO READ | Emergency Box Office: ఎమర్జెన్సీ బాక్సాఫీస్ వసూళ్లు.. రూ.25 కోట్ల బడ్జెట్, ఫస్ట్ డే రెస్పాన్స్తో గట్టెక్కుతుందా?

శ్యామ్ ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమలా ఆల్కెమిస్ కథ అందించారు. ది స్మైల్ మ్యాన్ శరత్ కుమార్‌కి 150వ చిత్రం. అనీష్ హరిదాసన్, ముగేష్ శర్మ మరియు ఆనందన్ టితో కలిసి సలీల్ దాస్ నిర్మించారు. ఇందులో సిజా రోజ్, ఇనియా, సురేష్ చంద్ర మీనన్, రాజ్‌కుమార్, జార్జ్ మరియన్, బేబీ ఆజియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కథేంటంటే:

ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను ఈజీగా సాల్వ్ చేసే సత్తా ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చిదంబరం(శరత్ కుమార్). అయితే, అనుకోకుండా అల్జీమర్స్ వ్యాధితో తన జీవితం తలక్రిందులై పోతుంది. అలా వ్యాధితో పోరాడుతున్న చిదంబరం తన జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోవడానికి కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉందనే విషయం తెలుసుకుంటాడు. ఈ క్రమంలో సవాలుతో కూడిన ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ కేసుని చేధించాడనికి రంగంలోకి దిగుతాడు. ఆ క్రూరమైన హంతకుడిని పట్టుకోవడం కోసం పోలీసు అధికారి ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? తన మానసిక స్థితిని లెక్క చేయకుండా విస్తృతంగా అన్వేషిస్తూ హంతకుడ్ని ఎలా ఎదుర్కున్నాడు? చివరికి ఆ కిల్ల‌ర్‌ను పట్టుకున్నాడా? లేదా అనేది మిగతా కథ.