Comedy OTT: అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Comedy OTT: అఫీషియల్.. ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా (Mazaka) మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ శివరాత్రి (2025 ఫిబ్రవరి 26న) సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది.

లేటెస్ట్గా ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను జీ5 అఫీషియ‌ల్‌గా ప్రకటించింది. ఈ శుక్రవారం (మార్చి 28) నుంచి జీ5 ఓటీటీలో మజాకా స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే, మజాకా సినిమా విడుదలకు ముందు ఆడియన్స్ నుంచి క్రేజీ టాక్ రావడంతో, మంచి ధరకే ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ నటించిన "ఊరి పేరు భైరవకోన" సినిమా సూపర్ హిట్ అయ్యింది. దర్శకుడు వీఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఓవర్ ఆల్ గా రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెటింది. ఈ సినిమాకి థియేటర్స్ లోనే కాకుండా, ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మజాకా ఎలాంటి ఫీల్ ఇస్తుందో చూడాలి.

Also Read:-ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్..

రైటర్ ప్రసన్న కుమార్.. డైరెక్టర్ త్రినాథరావులది ఇంట్రెస్టింగ్ కాంబో. వీరి కలయికలో వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్‌ వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా పెద్దగా దక్కించుకోలేదు. రూ.11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద రూ.9కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అనిల్ సుంకర పెద్దగా ఆశించినంత లాభాలను చూడలేకపోయాడు. ఇందులో రావు రమేష్, వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ, సుప్రీత్, అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.