వర్సటైల్ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌లో నటించిన మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం కీలక పాత్రల్లో నటించారు. 2024 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇపుడు ఈ మూవీ నెలరోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
తాజాగా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. "మిస్టరీని ఛేదించడానికి సిద్ధంగా ఉండండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈటీవీ విన్ లో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఓటీటీ సంస్థ తెలిపింది. ఈ వైజాగ్ బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది.
Get ready to solve the mystery! 🔍 "Srikakulam Sherlock Holmes" is all set to stream on @ETVWin this January 24th. 🎬#SrikakulamSherlockHolmes #ETVWin pic.twitter.com/4vHlebal7y
— ETV Win (@etvwin) January 22, 2025
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కథ:
1991లోరాజీవ్ గాంధీ లాంటి నేత హత్య జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. సరిగ్గా అదే రోజు ఓ కేసు జరిగింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఆ కేసు చాలా మలుపులతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇది శ్రీకాకుళం నేపథ్యంలో నడిచే కథ. కేసును ఛేదించలేని పోలీసులు.. ప్రైవేట్ క్రియేటివ్ డిటెక్టివ్ (వెన్నెల కిషోర్)ను నియమిస్తారు. తను ఆ గ్రామంలోని ప్రేమజంటతో సహా ఏడుగురు అనుమానితులను గుర్తిస్తాడు. అలా వారంలోపే ఈ కేసును పరిష్కరించాల్సిన పరిస్థితిలో డిటెక్టివ్ తన దర్యాప్తు ఎలా చేస్తాడు? ఈ మిస్టరీలో భాగమైన వ్యక్తులను గుర్తించగలిగాడు? అసలు ఓం.. షెర్లాక్ హోమ్స్ ఎలా అయ్యాడు? అనేది మిగతా కథ.