టీ-20వరల్డ్ కప్ గెలిచి భారత్ లో అడుగుపెట్టిన టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. వారిని అభినందించేందుకు దూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. జాతీయ జెండాలు ఊపుతూ స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఐటీసీ మౌర్యకు చేరుకున్న భారత జట్టుకు అక్కడ డప్పు చప్పుళ్లతో వెల్కమ్ చెప్పారు హోటల్ సిబ్బంది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న టీమిండియా జట్టు ఐటీసీ మౌర్య హోటల్‌లో ప్రత్యేకంగా కేక్ కటింగ్ వేడుకను నిర్వహించింది. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లే ముందు టీమ్ ఈ వేడుకల్లో పాల్గొంది.
ఈ కార్యక్రమం అనంతరం భారత జట్టు ముంబైకి వెళుతుంది. గురువారం (జూలై 4) సాయంత్రం 5:00 గంటలకు వాంఖడే స్టేడియంలో బీసీసీఐ విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న ఈ విజయోత్సవ ర్యాలీ ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుండి ప్రారంభమై వాంఖడే స్టేడియం వరకూ సాగనుంది. ఈ ర్యాలీలో భారత క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీసీసీఐ సెక్రటరీ జై షా పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తిని పంచుకున్నారు.
విక్టరీ పరేడ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
టీమిండియా టీ20 ప్రపంచ కప్ విక్టరీ పరేడ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తన అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ లో "ఫాలో ది బ్లూస్" ఎడిషన్‌లో 9 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. జియో సినిమా వెబ్ సైట్ లో సాయంత్రం 4.30 నుండి ఈ విజయ్ పరేడ్ లైవ్ చూడవచ్చు.
Also Read:ఐటీసీ మౌర్య హోటల్‌లో టీమిండియా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్
17 ఏళ్ళ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా బెరిల్ హరికేన్ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత క్రికెటర్లు స్వదేశానికి చేరుకోవడం ఆలస్యం అయింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌లో వీరు భారత్‌కు బయలుదేరి గురువారం(జులై 4) ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విండీస్ గడ్డపై దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.