
రెడ్ రాకెట్’,‘ది ఫ్లోరిడా ప్రాజెక్ట్’వంటి చిత్రాలను తీసిన సీన్ బేకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే ‘అనోరా’.ఆస్కార్ 2025 అవార్డుల్లో ‘అనోరా’ (Anora) మూవీ సత్తా చాటింది. ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులును దక్కించుకుని టాక్ అఫ్ ది ఆస్కార్గా నిలిచింది.
అనోరా ఓటీటీ:
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘అనోరా’ మూవీ నేడు (మార్చి 17న) మరో ఓటీటీకి వచ్చేసింది. రెంట్ లేకుండా జియోహాట్‍స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. జియోహాట్‍స్టార్ ఓటీటీ సబ్‍స్క్రిప్షన్ ఉన్న యూజర్లు ఫ్రీగా ఈ సినిమా చూసేయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ భాషల్లో అనోరా మూవీ అందుబాటులో ఉంది.
ఇప్పటికే, ఈ మూవీ 3 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతం ఈ మూవీ రెంటల్ విధానంలో మాత్రమే ఈ ప్లాట్‍ఫామ్‍ల్లో చూసేలా సిద్ధంగా ఉంది. ఇక వీటిలో ఈ సినిమాని చూడాలంటే రెంట్ చెల్లించి చూడాల్సిందే.
Also Read:-భారీ వసూళ్లతో దూసుకెళ్తోన్న నాని కోర్ట్..
ఈ మూవీకి సీన్ బేకర్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‍ప్లే, ఎడిటింగ్, దర్శకత్వ విభాగాల్లో పనిచేసి సత్తా చాటాడు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాడు.
Winner of five academy awards including ‘Best Picture’ and the Palme d’Or at the Cannes Film Festival, #Anora now streaming on the Peacock Hub on JioHotstar.
— JioHotstar (@JioHotstar) March 17, 2025
Available in English and Hindi. pic.twitter.com/SdhRbXL1O1
అనోరా కథేంటంటే:
అనోరా మిఖీవా (మైకీ మాడిసన్ ) అనే 23 ఏళ్ల వేశ్య (వ్యభిచారి) చుట్టూ జరిగే కథ ఇది. ఆమెకు రష్యన్ పరిపాలకుడు కుమారుడు వన్య జాకరోవ్ (ఇడిల్‍స్టెయిన్) పరిచయం ఏర్పడుతుంది. ఒక వారం పాటు అతనితో ఉండటానికి ఆమెకు $15,000 డాలర్లుతో డీల్ సెట్ చేసుకుంటుంది. ఇక కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మిఖీవా, జాకరోవ్ పెళ్లి చేసుకుంటారు.
అయితే, వీరిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని జాకరోవ్ పేరెంట్స్ డిసైడ్ అవుతారు. అందుకు తమ కుమారుడిని వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తారు. మరి, అని వారిచ్చిన ఆఫర్‌ను అనోరా స్వీకరించిందా? లేదా? ఈ క్రమంలో అనోరాకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. అనోరా ఎలాంటి మలుపులు పేస్ చేయాల్సి వచ్చింది. అనోరా, జాకరోవ్ కలిసే ఉండగలిగార? చివరికి ఏమైందనేది కథ సారాంశం.
Sean Baker is the first person in #Oscars history to win 4 Academy Awards for the same film in one evening. pic.twitter.com/L9fEjZk8J4
— IndieWire (@IndieWire) March 3, 2025