Maharaja Official OTT Release: అఫీషియల్..ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌..ఏ ప్లాట్‍ఫామ్‍లో రానుందంటే?

Maharaja Official OTT Release: అఫీషియల్..ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి యాక్షన్‌ థ్రిల్లర్‌..ఏ ప్లాట్‍ఫామ్‍లో రానుందంటే?

వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్‌సేతుపతి (Vijay Sethupathi) కెరీర్‌లో 50వ చిత్రం ‘మహారాజ' (Maharaja). దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. రివెంజ్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ ను మెప్పించింది. 

ట్విస్ట్‌లు,మ‌లుపులతో సాగే ఈ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్  జూన్ 14న థియేటర్లలో రిలీజై రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.ఇపుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.తాజాగా మహారాజ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నెట్‍ఫ్లిక్స్(Netflix)లో మహారాజ మూవీ  జూలై12 నుంచి స్ట్రీమింగ్‍ కానుంది.

కాగా ఈ మూవీ తమిళం,తెలుగుతో పాటు హిందీ,కన్నడ,మలయాళం భాషల్లోనూ నెట్‍ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. దీంతో.. విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన మహారాజ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మహారాజ సినిమాను ప్యాషన్ స్టూడియోస్,ది రూట్ థింక్ పతాకాలపై సుధాన్ సుందరం,జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు.అజ్నీశ్ లోకనాథ్ సంగీతం మ్యూజిక్ ఇచ్చారు.

కథ: 

మహారాజ(విజయ్ సేతుపతి)..భార్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ నడుపుకుంటూ ఉంటాడు. అయితే యాక్సిడెంట్ తన కూతురిని ఇనుప చెత్తబుట్ట కాపాడుతుంది. అందుకే ఆ చెత్తబుట్టని లక్ష్మి అని పిలుస్తూ..ప్రేమగా చూసుకుంటాడు. కానీ, ఒకరోజు ఆ చెత్తబుట్ట కనిపించకుండా పోతుంది. వెతికిపెట్టమని పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఇక మరోపక్క సెల్వం(అనురాగ్ కశ్యప్) దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరి మహారాజాకు, సెల్వంకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్టకు లక్ష్మి అని పిలుచుకునేంత ప్రత్యేకత ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే మహారాజ సినిమా చూడాల్సిందే.