Chhaava OTT: ఓటీటీలోకి బాక్సాఫీస్‍ సూపర్ హిట్ ఛావా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Chhaava OTT: ఓటీటీలోకి బాక్సాఫీస్‍ సూపర్ హిట్ ఛావా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చావా (Chhaava). ఈ సినిమాలో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోందీ. ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించిందీ చావా. హిందీలో రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు అందుకున్న ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

తెలుగులో మార్చి 7న విడుదలైన ఈ సినిమాకు మూడు రోజుల్లో రూ.10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక ఫైనల్ రన్ లో ఫైనల్‌గా రూ. 15 కోట్ల మార్క్‌ను ఛావా టాలీవుడ్‌లో అందుకుంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే, ఛావాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛావా సినిమా వచ్చేనెల (ఏప్రిల్ 11) నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందనే టాక్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులని నెట్ ఫిక్స్ సొంతం చేసుకుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ పై నెట్ ఫిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఛావా మూవీకి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీని మాడ్‍డాక్ ఫిల్మ్స్ సుమారు రూ.140కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించినట్లు అంచనా!