
మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ లైలా (Laila) ఓటీటీ అప్డేట్ బయటకి వచ్చింది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ‘లైలా’ ఫిబ్రవరి 14న రిలీజై నెగిటివ్ టాక్తో డిజాస్టర్గా నిలిచింది.
క్రింజ్ కామెడీతో అసభ్యంగా ఉందంటూ నెటిజన్స్ నుంచి భారీ విమర్శలు వచ్చాయి. దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఈ మూవీ రూ.16 - 18 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. కానీ, రిలీజైన 9 రోజుల తర్వాత ఇది కేవలం రూ.3.77 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అంటే, ఇది మొత్తం బడ్జెట్‌లో దాదాపు 20.9% రికవరీ చేసింది.
లైలా ఓటీటీ:
లైలా మూవీ మార్చి 7న ఓటీటీలోకి రానుందని సమాచారం. అయితే, ఈ సినిమా డిజిటల్ హక్కులను ముందుగా ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు రాగా ఇపుడు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ మూవీ ముందుగా ఆహాలోకే స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. మరి ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో కూడా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
లైలా కథేంటంటే:
హీరో విశ్వక్ సేన్ సోను అనే యువకుడిపాత్రలో నటించాడు. అయితే సోను అనుకోకుండా తన ఏరియా ఎమ్మెల్యే(అభిమన్యు సింగ్) తో గొడవపడి తప్పించుకుని తిరుగుతుంటాడు. అలాగే ఓ సమస్యలో ఇరుక్కుని పోలీసులకి టార్గెట్ అవుతాడు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే మనుషులు సోను కోసం వెతుకుతూ ఉంటారు. వీరినుంచి తప్పించుకునేందుకు సోను లేడీ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? కానీ సోనూ మోడల్ లేడీ గెటప్ కి విలన్ ఫిదా అయ్యి ప్రేమలో పడతాడు. అంతేకాదు అసలు విషయం తెలియక పెళ్లికూడా చేసుకోవాలనుకుంటాడు. దీంతో సోనూ మోడల్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు..? చివరికి ఏమైందనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా లైలా సినిమా చూడాల్సిందే.