Ugadi 2025: ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది... తెలుగు సంవత్సరాదిని మొదట ఎవరు జరుపుకున్నారు..

Ugadi 2025: ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది... తెలుగు సంవత్సరాదిని మొదట ఎవరు జరుపుకున్నారు..

కొత్త తెలుగు సంవత్సరాది రాబోతుంది.  ఇప్పటికే మామిడి పిందలు వచ్చేశాయి.  వేప చెట్లు చిగురించడానికి సిద్దంగా ఉన్నాయి.  హిందువులు  కొత్త సంవత్సరాది ... ఉగాది పండుగను  ఈ ఏడాది ( 2025) మార్చి 30న జరుపుకుంటారు.   మహర్షి వేదవ్యాసుడు తెలిపిన వివరాల ప్రకారం  ఉగాది పండుగ శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది. అంటే కలియుగం ప్రారంభమైన రోజున ఉగాది పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కలియుగం క్రీ.పూ.  3102 ఫిబ్రవరి 17/18 అర్ధరాత్రి ప్రారంభమైంది.

శాతవాహనుల కాలంలో ఉగాది పండుగను జరుపుకోవడం ప్రారంభించారని చరిత్ర చెబుతుంది. క్రీ,శ. 7వ  శతాబ్దంతో ఆంధ్ర శాశనంలో ఉగాది పండుగ గురించి ప్రస్తావించారు.  రాజుల కాలంలో  కొత్త సంవత్సరం రోజున ప్రజలకు ధన  ధాన్యాలు బహుమతిగా ఇచ్చారు.  ఈ రోజున రాజు .. నేరుగా ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకునేవారట.  

క్రీ.శ 2 వ శతాబ్డంలో హాలుడు ఉగాది పండుగ గురించి గాథాసప్తశతి అనే గ్రంథంలో వివరిస్తూ.. నవ సంవత్సరం అని పేర్కొన్నారు. కాల క్రమేణ అది వాడుక భాషలో  ఉగాదిగా మారిందని.. తెలుగు.. కన్నడ ప్రజలకు చెందిన సంస్కృతులలో ఉగాది పండుగ  చాలా ముఖ్యమైనదని ఆ పుస్తకంలో రాశారు.   గాథాసప్తశతి  గ్రంథం ప్రకారం  వసంత రుతువు రాకను సూచించే విధంగా ఈ పండుగను జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. 

ఉగాది అంటే ‘కొత్త యుగం ప్రారంభమని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం చివరిది. .. మొదటిది చైత్రమాసం. .. చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితి. ప్రస్తుతం జరుగుతున్న క్రోధినామసంవత్సరం 2025 ..  మార్చి 29న ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి30  న విశ్వావశు నామ సంవత్సర  చైత్ర మాసం ప్రారంభం అవుతుంది. చైత్ర మాసం ప్రారంభమయ్యే మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. 

ALSO READ | హోలీ తర్వాత చర్మంపై దురద, ర్యాషెస్ వచ్చాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి...

ఉగాది   తెలుగు సంవత్సరంలో  మొదటి రోజు. వాతావరణం ప్రకారం ఈ రోజుకు ఎంతో  ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఈ రోజు నుండి వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత కాలంలో చెట్లు చిగురిస్తాయి.  తాజా పువ్వులు వికసిస్తాయి.  జనాలు ఎంతో ఇష్టంగా తినే మామిడి కాయలు ఈ కాలంలో పండుతాయి.  ఉగాది రోజున  కొత్త పనులు చేపట్టేందుకు శుభ సమయం అని తెలుగు ప్రజలు నమ్ముతారు.

ఉగాది పండుగ మూలాలు చాలా పురాతనమైనవి. ఈ పండగ మొదటి ప్రస్తావన శాతవాహన రాజుల కాలంలో కనిపిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. శాతవాహనులు హిందూ మతం గొప్ప పోషకులు కావడం వల్ల ఆనాడే ఉగాది పండుగను ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకునే వారని తెలుస్తోంది. ఉగాది  పండుగ అన్ని శుభాలను  చేకూర్చాలని.. మన జీవితాల్లో శాశ్వతంగా నూతన ఉత్సాహం నింపి.. ఆనందమయంగా జీవితం కొనసాగాలని  ఆశిద్దాం...!!!