శ్రీ కృష్ణ జన్మాష్టమి .. ఆగష్టు 26 లేక 27 ..... ఎప్పుడు జరుపుకోవాలి!

 శ్రీ కృష్ణ జన్మాష్టమి .. ఆగష్టు 26 లేక  27 ..... ఎప్పుడు జరుపుకోవాలి!

శ్రీ కృష్ణజన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి.. ఆగష్టు 26 సోమవారమా - లేక ఆగష్టు 27 మంగళవారమా? అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉంది  శ్రీ కృష్ణ జన్మాష్టమి   - ఎప్పుడు జరుపుకోవాలి!.. పండితులు, పంచాగ కర్తలు ఏమంటున్నారో తెలసుకుందాం. ...

Krishna Janmashtami 2023 Date and Shubh Muhurat:  పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు...అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. ఈ సారి కృష్ణాష్టమి విషయంలో ఆగష్టు 26 సోమవారమే పండుగ అని పండితులు నిర్ణయించారు. అయితే ఆరోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది..మర్నాడు ఆగష్టు 27 మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తోంది. అందుకే ఆగష్టు 26 సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి.  

అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు

  • ఆగష్టు 26 సోమవారం ఉదయం 8 గంటల 40 నిమిషాల తర్వాత అష్టమి ఘడియలు ప్రారంభం
  • ఆగష్టు 27 మంగళవారం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు అష్టమి ఘడియలు ముగింపు
  • శ్రీ కృష్ణుడి జన్మనక్షత్రం రోహిణి నక్షత్రం ప్రారంభ సమయం:  ఆగష్టు 26 సోమవారం రాత్రి 9 గంటల 23 
  • శ్రీ కృష్ణుడి జన్మనక్షత్రం రోహిణి నక్షత్రం ముగింపు  సమయం: ఆగష్టు 27 మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలు

 కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?

సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు.  నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే పంచాంగకర్తలంతా ఆగష్టు 26 సోమవారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు.  శ్రావణమాసంలో అమావాస్య ముందువచ్చే అష్టమి రోజు అర్థరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు..మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు. అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే సెలబ్రేట్ చేసుకుంటారు. 

ALSO READ | Krishna Ashtami Special: ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఎన్నేళ్లు పాలించాడో తెలుసా..

కృష్ణాష్టమి నాడు ఉపవాసం పాటిస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శ్రీ కృష్ణుడిని ప్రార్థించి ఉపవాసం పాటిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని అంటారు. అంతేకాదు ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్రనామా పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు, సకల శుభకాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వేణుగోపాలుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయని అంటారు. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కంద పురాణంలో వివరించబడింది.