బతుకమ్మ పండుగ ఎన్నడు చేసుకోవాలె?

బతుకమ్మ పండుగ ఎన్నడు చేసుకోవాలె?

అధిక మాసంతో అందరిలో అయోమయం

పెత్రమాస.. కాదు అక్టోబర్‍ 16

బ్రాహ్మణ సంఘాల భిన్నాభిప్రాయం

ఇంకా అధికారిక ప్రకటన చేయని సర్కారు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: బతుకమ్మ పండుగ విషయంలో ఈసారి కొంత కన్‍ఫ్యూజన్‍ నెలకొంది. ఈ ఏడాది అధిక మాసం రావడం గందరగోళానికి కారణమవుతోంది. ఏటా భాద్రపద మాసంలో పెత్రమాస (పితృ అమావాస్య) సందర్భంగా మొదటిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ ఆడుకునే ఆచారం ఉంది. ఆ విధంగా చూస్తే ఇప్పుడొచ్చే గురువారమే ఆట ప్రారంభం కావాలి. కానీ ఈ విషయంలో ఆడపడుచులు ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. ఎప్పటిలానే సెప్టెంబర్‍ 17న వచ్చే పెత్రమాస రోజే బతుకమ్మ ఆడుకోవాలని కొందరు బ్రాహ్మణ సమాఖ్య బాధ్యులు చెబుతున్నారు. సిద్ధాంతులు, వేద పండితులు మాత్రం అక్టోబర్ 16న వచ్చే అధిక ఆశ్వీజ మాసంలోని అమావాస్య నుంచి వరుసగా తొమ్మిది రోజులు బతుకమ్మ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా భిన్నాభిప్రాయాలతో జనాలు మరింత అయోమయానికి గురవుతున్నారు.

విద్వత్ సభ నిర్ణయం.. అక్టోబర్​ 16​

రాష్ట్రంలో ఏ పండుగ ఎప్పుడు చేసుకోవాలనే విషయం నిర్ణయించడానికి తెలంగాణ విద్వత్ సభ ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు అందరు సిద్ధాంతులు, వేద పండితులు, ప్రధాన పురోహితులు ఇందులో సభ్యులుగా ఉంటారు. కొన్ని పండుగల తేదీల  విషయంలో సందేహాలు వచ్చినప్పుడు మెజార్టీ సిద్ధాంతులు, పంచాంగకర్తల గణిత లెక్కలు, శాస్త్ర గ్రంథాల పరిశీలన ఆధారంగా విద్వత్ సభ నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా బతుకమ్మ పండుగను అక్టోబర్‍ 16 నుంచే వరుసగా తొమ్మిది రోజులు నిర్వహించుకోవాలని విద్వత్‍ సభ నిర్ణయమని అందులోని బాధ్యులు తెలిపారు.

సర్కారు క్లారిటీ ఇస్తేనే బెటర్‍

ప్రస్తుతం అంతా  రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పెత్రామాస మరో నాలుగు రోజుల్లో ఉన్నందున సర్కారు వేద పండితులతో మాట్లాడి ఓ నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నారు.

పెత్రమాస రోజే..

ఈ పెత్రమాస రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడుకుని మిగతా 8 రోజులు అక్టోబర్ 17 నుంచి నిర్వహించుకోవాలి. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర వైదిక పురోహితుల సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించాం. అధికమాసం రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.

‑ గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్​

అక్టోబర్‍లోనే  పండుగ

అక్టోబర్‍ 16 నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ చేసుకోవాలే. ఇప్పుడు ఒక్కరోజు ఆడి నిమజ్జనం చేయకుండా నెలయ్యాక మరో ఎనిమిది రోజులు బతుకమ్మ ఆడడం సరికాదు. తొమ్మిది రోజుల పండుగ అంటేనే మధ్యలో రోజు
విడవకూడదు.

‑ అయినవోలు అనంత మల్లయ్య శర్మ, వరంగల్ భద్రకాళి దేవాలయ ఆస్థాన సిద్ధాంతి 

For More News..

అడిషనల్ కలెక్టర్ నగేష్ ఒత్తిడి తెచ్చినా తప్పు చేయలే

ఢిల్లీ అల్లర్ల కేసులో సీతారాం ఏచూరి

మూడెకరాల స్కీమ్‌‌కు ఫుల్ స్టాప్​ పెట్టిన కేసీఆర్