![ప్రధానికి దక్కిన అరుదైన గౌరవం](https://static.v6velugu.com/uploads/2019/06/pradani.jpg)
కిర్గిజ్ స్థాన్ లో షాంఘై కోఅపరేషన్ ఆర్గనేషన్ సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బిష్కేక్ వేదికగా జరిగిన ఈ సదస్సుకు భారత పీఎం మోడీ తో పాటు పలు దేశాల ప్రధానులు హాజరయ్యారు.
ప్రధాని మోడీ ఆ సదస్సులో జరిగే సమావేశానికి వస్తున్న సమయంలో హఠాత్తుగా చిరుజల్లు కురిసింది. ఆయన వెంటే వస్తున్న కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సూరన్ బే జీన్బెకవ్ వర్షానికి తడవకుండా మోడీని గొడుగు పట్టి సాదరంగా తీసుకుని వెళ్లారు. అదే సమయంలో ఫోటో గ్రాఫర్లు ఓ క్లిక్ చేశారు. అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. మన దేశ ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా దీనిని భావిస్తున్నారు.
అచ్చం ఇలాంటి ఘటనే శ్రీలంకలో జరిగింది. గతవారం ప్రధాని శ్రీలంక పర్యటన చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరసేన.. ప్రధాని మోడీని స్వాగతించే సమయంలో వర్షం పడడంది. దీంతో సిరిసేన తాను తడవకుండా ఉండేందుకు గొడుగును వాడారు. కానీ ఆ విజువల్స్ లో మన మోడీకీ సిరిసేన గొడుగు పట్టినట్టుగా కనిపించింది.
మొత్తానికి ఈ రెండు సంఘటనలు యాదృచ్చికంగా జరిగినా మన దేశా ప్రధానికి, ఇతర దేశ ప్రధానులు గౌరవిస్తున్నట్టు ఉండడం చూడ్డానికి చాలా బాగుందంటున్నారు దేశ ప్రజలు.