సుధామూర్తి, ఆనంద్ మహీంద్రపైనా కమ్రా కామెంట్స్

సుధామూర్తి, ఆనంద్ మహీంద్రపైనా కమ్రా కామెంట్స్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్​నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా.. తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తితో పాటు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్​మహీంద్రపైనా ఇదే తరహా కామెంట్లు చేశారు. తన 'నయా భారత్' షోలో మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలుగా నటించే ధనవంతుల్లో సుధామూర్తి ఒకరు అని అన్నారు. ‘‘సింప్లిసిటీకి తానే నిదర్శనమని ఆమె చెప్తారు. 

దానిపై ఆమె 50 పుస్తకాలూ రాశారు" అని కమ్రా అన్నారు. సుధామూర్తిలా మిమిక్రీ చేస్తూ ఓ కథను కూడా చెప్పారు. అలాగే, ఆనంద్​ మహీంద్రా ట్వీట్‌లను ఎగతాళి చేస్తూ.. "ఆనంద్.. థర్మోడైనమిక్స్, మెరైన్ బయాలజీ, రేడియేషన్ గురించి ట్వీట్ చేస్తారు. కానీ, తన సొంత కార్లను ఎలా మెరుగుపరచుకోవాలో తప్ప" అని అన్నారు. 

కాగా,  షిండేపై  వ్యాఖ్యల  కేసులో కమ్రాకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఏప్రిల్ 7 వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కమ్రాపై ముంబైలో కేసు నమోదైనా, ఆయన తమిళనాడు వ్యక్తి కావడంతో  బెయిల్​ కోసం అక్కడి కోర్టును ఆశ్రయించారు.