ట్రంప్, మోదీ ప్రజాస్వామ్యానికి ముప్పా?.. ఇటలీ ప్రధాని మెలోనీ కామెంట్స్..

ట్రంప్, మోదీ ప్రజాస్వామ్యానికి ముప్పా?.. ఇటలీ ప్రధాని మెలోనీ కామెంట్స్..

ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు, ప్రధాని మోదీ, నేను మాట్లాడుతుంటే మమ్ములను ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారెందుకు అని జార్జియో మెలోని ప్రశ్నించారు. వలసను నియంత్రించడం, వాక్ స్వాతంత్ర్యాన్ని సమర్ధించడం తప్పా అని అన్నారు. ఇంతకీ మెలోనీ ఆసక్తికర వ్యాఖ్యలను ఎక్కడ అన్నారు.. ఎవరిని ఉద్దేశించి అన్నారో వివరాల్లోకి వెళితే.. 

ఫిబ్రవరి 22,2025న వాషింగ్టన్ డీసీలో కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC) జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన ఇటలీ ప్రధాని జార్జియో మెలోని వామపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వాక్ స్వాతంత్ర్యం, వలసల నియంత్రణ వంటి సాంపదాయవాద అంశాల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. 

ALSO READ | భగవద్గీత సాక్షిగా కాష్​ పటేల్ ప్రమాణం.. యూఎస్ ఎఫ్బీఐ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తి

మెలోని ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫిబ్రవరి 22శనివారం బయటికొచ్చింది. ఈ వీడియోలో మెలోనీ మాట్లాడుతూ.. బిల్ క్లింటన్, టోని బ్లెయర్ వంటి వారు 1990లలో ప్రపంచ వామపక్ష ఉదారవాద నెట్ వర్క్ ను సృష్టించినప్పుడు వారిని రాజనీతజ్ణులు అన్నారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలోని, ప్రధాని మోదీ మాట్లాడినప్పుడు వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఎందుకు పరిగణిస్తున్నారని క్వశ్చన్ చేశారు. 

యూరప్ రాజకీయాల్లో సంప్రదాయా వాదులు పెరుగుతూనే ఉన్నారు. వారు ప్రతిభావంతులవుతున్నారు. అందుకే వామపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ విజయం వారికి చికాకు కలిగిస్తుంది. వారికి హిస్టిరియాగా మారింది. అంతేకాదు సంప్రదాయ వాదులు ఇప్పుడు ప్రపంచానికి సహకరిస్తున్నారు కాబట్టి వామపక్షాలకు చికాకు తెప్పిస్తోందన్నారు మెలోని.  

ఇంతకీ CPAC అంటే.. ఎందుకది?

CPAC  వెబ్ సైట్ ప్రకారం.. 1964లో CPAC స్థాపించబడింది.అమెరికాలో మొదటి సంప్రదాయవాద సంస్థ. ప్రతి అమెరికన్ జీవిత విలువలు, స్వేచ్ఛ, ఆస్తి రక్షణకు ఇది వాచ్ డాగ్. 2025, ఫిబ్రవరి 19నుంచి 22 వరకు దేశ రాజధాని వాషింగ్టన్ లో జరిగిన ప్రపంచ అత్యంత, అతిపెద్ద సంప్రదాయవాదుల సమావేశం.