వరంగల్ జిల్లా: అతివేగంగా వచ్చిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఢీకొడితే.. ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలైంది. వర్ధన్నపేట మండలం కట్రాల గ్రామ శివారు హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అతివేగంతో వచ్చి టర్నింగ్ తీసుకుంటున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజన్, టైర్లు రెండు ముక్కలుగా విరిగిపోయింది.
ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ప్యాసింజర్లు ప్రమాణిస్తున్నారు. అందులో 20 మందికి స్పల్ప గాయాలు అయ్యాయి. ప్రాణనష్టం ఎక్కువగా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Wardhannapet road accident, RTC bus hit tractor pic.twitter.com/4oOUiwQM1A
— Mr. Mohan (@kundenapally_12) October 9, 2024