
కొత్తగా ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ తిరగడానికి దారి తెలియదు కాబట్టి, వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తుంటారు. వెళ్లాల్సిన చోటు అడ్రెస్ టైప్ చేయగానే అది దారి చూపిస్తుంది. అయితే, ఇప్పుడు గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌తో దేశంలోని ప్రతి గ్రామంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో యూజర్లు లోకల్‌గా ఉన్న చిన్న బిజినెస్ కాంప్లెక్స్‌లను కూడా ఈజీగా గుర్తించొచ్చు. సెర్చ్ చేసిన అడ్రెస్‌కి దగ్గర్లో షాప్, ఇల్లు లేదా ఆఫీస్‌ను 360 డిగ్రీల యాంగిల్లో చూడొచ్చు. ఇప్పటిదాకా గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ మనదేశంలోని కొన్ని మెయిన్ సిటీల్లోనే అందుబాటులో ఉంది. అందువల్ల యూజర్లు మ్యూజియం, రెస్టారెంట్, స్మాల్ బిజినెస్ కంపెనీలను ఈజీగా చేరుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ ద్వారా దేశంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని వీధులను చూడొచ్చు. త్వరలో మిగతా గ్రామాలను కూడా అందుబాటులోకి తీసుకురానుందట గూగుల్.
ఇలా వాడాలి
ఫోన్ లేదా కంప్యూటర్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను వాడొచ్చు. మొబైల్లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత కుడివైపున పైభాగంలో స్క్వేర్ షేప్‌లో ఉండే సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే టెరైన్, శాటిలైట్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో స్ట్రీట్ వ్యూ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. కంప్యూటర్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమ వైపు కింది భాగంలో లేయర్స్ (layers) అనే ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత వెతుకుతున్న అడ్రస్‌ను సెర్చ్ బార్లో ఎంటర్ చేయాలి. లేదా గూగుల్ మ్యాప్స్ ద్వారా కావాల్సిన ప్రదేశం కోసం మౌస్ సాయంతో వెతకొచ్చు. ఒకవేళ అడ్రెస్ సెర్చ్ బార్లో టైప్ చేస్తే, ఆ ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్ మార్క్ చేసి చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్ట్రీట్ వ్యూ సాయంతో పరిసరాలను చూడొచ్చు.