Women's Tri-series: టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక.. ట్రై సిరీస్ లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు!

Women's Tri-series: టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక.. ట్రై సిరీస్ లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ వివరాలు!

భారత మహిళా క్రికెటర్లు వరల్డ్ కప్ కు ముందు కొత్త సవాలుకు సిద్ధం కానున్నారు. శ్రీలంక గడ్డపై ట్రై సిరీస్ ఆడేందుకు రెడీ అయిపోయారు. భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా ఈ ముక్కోణపు సిరీస్ ఆడనున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 27) ఈ మెగా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా మొత్తం 7 మ్యాచ్ లు జరుగుతాయి. అన్ని మ్యాచ్ లకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. మే 11 న జరగబోయే ఫైనల్ తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఫైనల్‌కు ముందు అన్ని జట్లు నాలుగు మ్యాచ్ లు ఆడతాయి. 

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఒక్కో జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో శ్రీలంకతో ఇండియా ఆదివారం (ఏప్రిల్ 27) తలబడుతుంది. జట్టు విషయానికి వస్తే లెఫ్ట్ హ్యాండర్ స్పిన్నర్లు  శుచి ఉపాధ్యాయ్, శ్రీ చరణిలకు అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కశ్వి గౌతమ్ తొలి సారి తొలిసారి జట్టులో స్థానం దక్కించుకుంది. యస్తిక భాటియా, స్నేహ్ రాణా కూడా తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రీలంక జట్టుకు అనుభవజ్ఞురాలైన ఆల్ రౌండర్ చమరి అథపత్తు నాయకత్వం వహిస్తారు. సౌతాఫ్రికా జట్టుకు లారా వోల్వార్డ్ట్ కెప్టెన్ గా చేస్తుంది. 

ఇండియా vs శ్రీలంక vs సౌతాఫ్రికా మహిళల ట్రై-సిరీస్‌ను ఎప్పుడు చూడాలి?

శ్రీలంక మహిళల ట్రై-సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు జరుగుతాయి. 

మహిళల ట్రై-సిరీస్‌ను ఎక్కడ చూడాలంటే..?
 
శ్రీలంక మహిళల ట్రై-సిరీస్‌లోని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఫ్యాన్‌కోడ్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.


ఇండియా, శ్రీలంక, సౌతాఫ్రికా స్వాడ్స్:   

భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, కష్వీ గౌతమ్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్, శ్రీ హసబ్నీలు

దక్షిణాఫ్రికా జట్టు:

లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, లారా గూడాల్, సినాలో జాఫ్తా, అయాబొంగా ఖాకా, మసబాటా క్లాస్, సన్ లూస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, షేష్నీ, ఎమ్ షన్గాన్, నోన్‌స్, ఎం షన్గాన్

శ్రీలంక జట్టు:

చమరి అతపత్తు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి సిల్వా, కవిషా దిల్హరి, అనుష్క సంజీవని, హాసిని పెరీరా, పియుమి వత్సలా, మనుడి నానయక్కర, దేవ్మీ విహంగ, ఇనోకా రణవీర, ఇనోకా రణవీర, ఇనోకా రనవీర సెవ్వండి, మల్కి మదార, సుగండిక కుమారి, అచ్చిని కులసూర్య

ట్రై-సిరీస్ షెడ్యూల్

మొదటి వన్డే: శ్రీలంక vs భారత్, ఆదివారం, ఏప్రిల్ 27

రెండో వన్దే : భారతదేశం vs దక్షిణాఫ్రికా, మంగళవారం, ఏప్రిల్ 29

మూడో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, శుక్రవారం, మే 02

నాలుగో వన్డే: శ్రీలంక vs భారత్, ఆదివారం, మే 04

ఐదో వన్డే: దక్షిణాఫ్రికా vs భారత్, బుధవారం, మే 07

ఆరో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, శుక్రవారం, మే 09

ఫైనల్: ఆదివారం, మే 11