OTT Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొన్ని సినిమాలు చూడాలంటే భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమిలేదు. కొంతమంది ఆడియన్స్ కి సినిమాల్లో కథ, క్రైమ్ ఉంటే చాలు. ఎంచక్కా ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ లేటెస్ట్ మలయాళ సినిమా ముర (Mura). నవంబర్ నెలలో థియేటర్లో రిలీజైన ఈ సినిమా ఇపుడు ఓటీటీకి వచ్చేస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. 

ముర ఓటీటీ: 

హృధు హరూన్, సూరజ్ వెంజరమూడు మరియు మాలా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ముర. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 8న థియేటర్లలోకి వచ్చి ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ కథనాలు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇపుడీ ఈ మూవీ డిసెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారంగా ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ మూవీని ముహ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేశాడు. ఈ డైరెక్టర్ గతంలో కప్పెల మూవీతో ఆడియన్స్ కి ఎంతో సుపరిచితం. ముర మూవీతో మరోసారి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు డైరెక్టర్ ముహ్మద్ ముస్తాఫా. 

ALSO READ | విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు..నా చిన్న కొడుకు మనోజ్ చెప్పేవన్నీ అబద్ధాలు : మంచు నిర్మల

ముర కథ: 

కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన స్టోరీగా ముర తెరకెక్కింది. నలుగురు ఉద్యోగాలు లేని యువత చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఆనందు, సాజీ, మను మరియు మనాఫ్.. అనే ఈ నలుగురు కుర్రాళ్ళు తమిళనాడులో అధిక స్టేక్స్ దోపిడీకి ప్లాన్ చేస్తారు.ఈ దోపిడీ కోసం ప్రయత్నించే క్రమంలో వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నది ఈ మూవీలో ప్రధాన అంశంగా రూపొందించారు. థ్రిల్లింగ్ సీన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ ని కట్టిపడేయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.