న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల హడావుడితో దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. దేశ ముఖచిత్రమైన యూపీలో గెలవడం అధికార, విపక్ష పార్టీలకు కీలకంగా మారింది. అందుకే ఓటర్ల మనసులను ఆకట్టుకనేందుకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పార్టీల్లోని ప్రముఖ నేతలందరూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా యూపీ ప్రచార బరిలోకి ప్రధాని నరేంద్ర మోడీ దిగారు. వర్చువల్ పద్ధతిలో ప్రచారం చేసిన మోడీ.. నేరుగా సమాజ్ వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగారు. ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో యూపీ తగలబడుతుంటే ఆ పార్టీ నేతలు వేడుకలు జరుపుకున్నారని దుయ్యబట్టారు.
‘అల్లర్లతో పశ్చిమ యూపీ తగలబడుతుంటే అధికారం (సమాజ్ వాదీ పార్టీ)లో ఉన్న వాళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఐదేళ్ల కింద వరకూ అక్కడ బలం కలిగిన వాళ్లు, పవర్ లో ఉన్న వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు. ఆ సమయంలో వ్యాపారులను దోచుకునేవారు. స్త్రీలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడేవారు’ అని మోడీ చెప్పారు. యూపీ అభివృద్ధికి యోగి ఆదిత్యనాథ్ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఇది నకిలీ సమాజ్ వాద్ (ఫేక్ సోషలిజం) వర్సెస్ గరీబ్ కా సర్కార్ (పేదల ప్రభుత్వం)కు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు.
మరిన్ని వార్తల కోసం: