పెద్దపల్లి లో గర్ల్స్​జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీకి బిల్డింగ్​ కట్టేదెప్పుడు..?

పెద్దపల్లి లో గర్ల్స్​జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీకి బిల్డింగ్​ కట్టేదెప్పుడు..?
  • బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిథిలమవడంతో 2 ఏండ్లుగా క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ ల్యాబ్​లలో నడుస్తున్న క్లాసులు 
  • సొంత బిల్దింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేక అరకొర సౌకర్యాలతో అవస్థలు పడుతున్న గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  •  కొన్నేండ్లుగా పెద్దపల్లి జిల్లాలో విద్యపై పాలకుల నిర్లక్ష్యం

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీకి కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం పక్కకుపోయింది. పాత కాలేజీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిథిలమవడంతో రెండేండ్ల కింద క్లాసులు బంద్ చేశారు. కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తామన్న నాటి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించి మరిచిపోయింది. అదే స్థలంలో లైబ్రరీ నిర్మిస్తామని కుట్రలకు తెరతీశారు. 

కానీ ఇప్పటిదాకా కాలేజీకి కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విద్యపై పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ప్రభుత్వం శాంక్షన్ చేసిన కాలేజీలను కూడా కాపాడలేకపోయారు. ఉన్నవాటికి సరైన బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేకపోగా.. మరికొన్ని విద్యా సంస్థలు వేరే ప్రాంతానికి తరలిపోతున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. 

విద్యపై గత పాలకుల నిర్లక్ష్యం 

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని  గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్ కాలేజీ బిల్డింగ్ శిథిలమవడంతో రెండేళ్ల కిందనే మూసేశారు. బిల్డింగ్ కోసం అప్పట్లో రూ. 2 కోట్లతో ప్రపోజల్ పంపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటర్ క్లాసులు బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్ కాలేజీ ల్యాబ్​లలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ సైన్స్ గ్రూపులకు ప్రాక్టికల్ ల్యాబ్​లు అందుబాటులో లేకుండా పోయాయి. మరోవైపు అరకొర వసతుల వల్ల గర్ల్స్​ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో టాయిలెట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

దీంతో ప్రభుత్వ కాలేజీలో చేరేందుకు గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుకంజ వేస్తున్నారు. దీంతోపాటు కొన్నేండ్లుగా పెద్దపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ విద్యపై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొత్త సంస్థలను తీసుకురాకపోగా.. మంజూరైన వాటిని కూడా కాపాడుకోలేకపోయారన్న ఆరోపణలున్నాయి.  గతంలో ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు గురుకుల జూనియర్ కాలేజీ మంజూరు కాగా దాన్ని గోదావరిఖనికి తరలించేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక్క గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్ కాలేజీని కూడా లేకుండా చేయడానికి ప్లాన్ చేశారన్న విమర్శలు ఉన్నాయి.  ఆ స్థలంలో లైబ్రరీ నిర్మించేందుకు భూమి పూజ కూడా చేయడం గమనార్హం. 

ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపినా ఎదురుచూపులే 

గతంలో పెద్దపల్లి  నియోజకవర్గ లీడర్లు బాలికల జూనియర్ కాలేజీ కొత్త బిల్డింగ్ కోసం ఎలాంటి ప్రయత్నం చేయ లేదు. గతంలో విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీ విద్యార్థులు ఆనాటి ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్​కు  కూడా సమస్యను వివరించారు. విద్యార్థులు చాలా సార్లు కొత్త బిల్డింగ్ కోసం ఆందోళన చేశారు. రెండేండ్ల కింద పెద్దపల్లి ఇంటర్మీడియట్ జిల్లా అధికారి నేతృత్వంలో రూ. 2 కోట్లతో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణాలకు ఇంటర్ బోర్డుకు ప్రపోజల్ పంపించారు. 

ఈక్రమంలో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు అధికారులు పెద్దపల్లిలోని శిథిలమైన బాలికల కాలేజీని పరిశీలించి వెళ్లారు. పెరిగిన భవన నిర్మాణ ఖర్చులకు ఈయేడు మరోసారి రూ. 4 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపారు. ఏ ఏటికాయేడు కాలేజీ నిర్మాణానికి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాయని భావించినా ఎదురుచూపులు తప్పడం లేదని విద్యాశాఖ అధికారులు వాపోతున్నారు.