పాకిస్థాన్లో ముగిసిన ఎన్నికలు..ఫలితాలు ఎప్పుడంటే..

పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడాల్సింది ఉంది. ఫిబ్రవరి 8 సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగిసింది. ఇక పాకిస్తాన్ తదుపరి నాయకుడు ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. పాకిస్తాన్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పాక్ మీడియా ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. 

మూడు దశల్లో ఫలితాలు 

పోల్ ఫలితాల ప్రకటన మూడు దశల్లో కొనసాగుతుంది. తాత్కాలిక ఫలితాలు, ఫలితాల ఏకీకరణ, ఫలితాల ప్రకటన ఉంటుంది. తుది ఫలితాలను ఫిబ్రవరి 9 తెల్లవారుజామున 2 గంటలలోపు ఎన్నికల కమిషన్ కు పంపాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులపై ఉంటుందని అడిషన్ డైరెక్ట్ జనరల్ (ADG)  చెప్పారు.