Holi 2025 : హోలీ ఫెస్టివల్ 14న లేక 15వ తేదీనా.. పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.. వివాదం ఎందుకు..?

Holi 2025 : హోలీ ఫెస్టివల్ 14న లేక 15వ తేదీనా.. పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.. వివాదం ఎందుకు..?

దేశ వ్యాప్తంగా రంగుల పండుగ జనాలు రడీ అవుతున్నారు.  రంగుల పండుగ అంటే అదేనండి హోలీ. ఈ ఏడాది ( 2025) హోలీ పండుగ విషయంలో కొంత సందిగ్దత నెలకొంది. హోలీ పండుగ మార్చి 14 వ తేది జరుపుకోవాలా.. మార్చి 15 వ తేది జరుపుకోవాలా.   అసలు  హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది... పండుగ చారిత్రక నేపథ్యం ఏమిటి.. ఈపండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు.  హోలీ పండుగ ఆచారాల గురించి తెలుసుకుందాం.. . .

హోలీ అంటే రంగుల పండుగ. ప్రతీ సంవత్సరం ప్రజలు ఎంతో సరదాగా, సంతోషంగా హోలీ పండుగను జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం  పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. పౌర్ణమి రాత్రి హోలికా దహనం జరుపుతారు. హోలీ రోజు  సరదాగా రంగుల చల్లుకుంటూ ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. 

హోలీకా దహన సమయం

  • పంచాగం ప్రకారం ఈ సంవత్సరం ( 2025)  ఫాల్గుణ మాసం పౌర్ణమి మార్చి 13  ఉదయం 10:25 గంటలకు ప్రారంభం
  • మార్చి 14,  మధ్యాహ్నం 12:03 గంటలకు పౌర్ణమి ముగింపు
  • హోలికా దహనానికి శుభ సమయం: మార్చి 13  రాత్రి 11.26 నుంచి అర్దరాత్రి 12.30 వరకు (64 నిమిషాలు)
  • భద్ర కాలము:  మార్చి 13 సాయంత్రం 6:28 గంటల వరకు

హోలీ ఎప్పుడు

 మార్చి 14న హోలీ పండుగ జరుపుకుంటారు. దీనిని ధూలేడి పండుగ అని అంటారు

హోలికా దహనం పద్దతి

హోలికా దహనం చేసేటప్పుడు శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోండి. పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంపిక చేసిన ప్రదేశంలో చెక్కలను పేర్చాలి. దాని పైన ఆవు పేడతో చేసిన హోలిక, ప్రహ్లాదుని విగ్రహాలను ఉంచాలి.

హోలికా దహనం నాడు పాటించాల్సిన నియమాలు

  • హోలీకా దహనం జరపేటప్పుడు భద్ర కాలం సమయంలో హోలికా దహనం చేయకూడదు. ఇది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది.
  • హోలికా దహనం చేసేటప్పుడు మంచి సమయంలోనే చేయాలి. అలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి.
  • హోలికా దహనం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలను మంటలకు దూరంగా ఉంచాలి.

హోలీ పండుగకు సంబంధించి పురాణ కథ 

అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఈ పండుగను జరుపుకుంటారు.  హోలీకాను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ కథ ఉంది. పురాతన కాలంలో రాక్షస రాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడుకి ఇది నచ్చలేదు. అప్పుడు అతను తన కొడుకు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతీసారి దేవుడు అతన్ని రక్షించాడు. ప్రహ్లాదుడు జుట్టుకి కూడా హాని జరగలేదు.

అప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడుని చంపడానికి అతని సోదరి హోలికను అగ్నిలో కాల్చమని కోరాడు. హోలికకు బ్రహ్మ దేవుడు నుంచి అగ్ని తనని కాల్చడని వరం పొందింది.అటువంటి పరిస్థితుల్లో హోలికా తన ఒళ్ళో ప్రహ్లాదుడిని పెట్టుకుని చెక్కలపై కూర్చుంది. కానీ విష్ణువు దయతో హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. అప్పటినుంచి అధర్మంపై ధర్మం విజయంగా ప్రతి సంవత్సరం హోలికా దహనం జరుగుతుంది.