పీఆర్సీ బకాయిలను ఇంకెప్పుడిస్తరు?

ఉమ్మడి రాష్ట్రంలో వేతన సవరణ బకాయిల చెల్లింపులు ఎన్నడూ లేట్​కాలేదు. ప్రభుత్వం వెంటనే ఇచ్చేది. లేదంటే వాటిని ఉద్యోగుల జీపీఎఫ్​అకౌంట్​లో గానీ జమ చేసేది. కానీ కొట్లాడి తెచ్చుకున్న సొంత రాష్ట్రంలో ఉద్యోగి రిటైర్ ​అయినప్పుడే బకాయిలు అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పెన్షనర్లకు సవరించిన వేతనం ప్రకారం పెన్షన్ ​అందని దుస్థితి. గతంలో ప్రతి నెల ఫస్ట్​కే శాలరీ పడేది. కానీ ప్రస్తుతం ధనిక రాష్ట్రంలో పదో తారీఖు దాకా వేతనాలు పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వేతన సవరణ బకాయిలు వెంటనే క్లియర్​చేయాలె. చెల్లింపుల్లో ఉన్న సందిగ్ధతను తొలగించి పరిస్థితిని చక్కదిద్దాలి. అప్పుడే వేతన సవరణతో ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. 

తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటిస్తానని, గతంలో జరిగినట్లు వేతన సవరణ ఏండ్ల తరబడి సాగదీయకుండా రెండు నెలల్లో నివేదిక తెప్పిస్తానని, పంద్రాగస్టు నుంచి కొత్త వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని 2018 మే16న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం కేసీఆర్​ప్రకటించారు. ఒక్క సభ్యుడితో వేతన సవరణ సంఘ రిపోర్టు తయారు చేయడం లేట్​అవుతుందంటూ మరో ఇద్దరు సభ్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా.. నివేదిక పూర్తయి.. సర్కారుకు సమర్పించడానికి 30 నెలలు పట్టింది. 2021 మార్చి 22న అసెంబ్లీలో సీఎం మరో​ ప్రకటన చేశారు. 11వ వేతన సవరణను ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అమలు చేస్తున్నట్లు, మొత్తంగా 9,17,979 మందికి వేతనాల పెంపుదల వర్తిస్తుందని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రత్యేక అభిమానంతో 12 నెలల బకాయిలను కూడా చెల్లించనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం ప్రకటన ప్రకారం12 నెలల బకాయిలతోపాటు వేతన సవరణ జరిగి కొత్త వేతనాలు వెంటనే అందుతాయని ఉద్యోగులు ఎంతో ఆశతో చూశారు. మార్చి 22 నాడు ప్రకటన చేస్తే.. జూన్11న సర్కారు పది జీవోలిచ్చింది.  కొత్త వేతనాలు జులై1నాడు చెల్లిస్తామని పేర్కొన్నారు. 1 జులై 2018 నుంచి 31 మార్చి 2020 వరకు 21 నెలలపాటు వేతన సవరణ నోషనల్​గా ఉంటుందని, 1 ఏప్రిల్​2020 నుంచి 31 మార్చి 2021 వరకు 12 నెలల బకాయిలను ఉద్యోగులకు పదవీ విరమణ సందర్భంగా చెల్లిస్తామని జీవోలో పేర్కొంది. 1 ఏప్రిల్​2021 నుంచి 31 జూన్​2021 వరకు రెండు నెలల బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ రకంగా వేతన సవరణ బకాయిలు చెల్లించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నడూ జరగలేదు. బకాయిలు వెంటనే చెల్లించేవారు. లేదంటే వాటిని ఉద్యోగుల జీపీఎఫ్​అకౌంట్లో కానీ జమ చేసేవారు. కానీ ఇప్పుడు రిటైర్​ అయినప్పుడే బకాయిలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
గ్రాట్యూటీ వర్తించదు..
అయితే1 జులై 2018 నుంచి 31 మార్చి 2020 మధ్య తర్వాత రిటైర్​అయిన వారిది మరో చరిత్ర. వారికి పెరిగిన గ్రాట్యూటీ వర్తించదు. కానీ పెన్షన్ కమ్యుటేషన్ మాత్రం వస్తుందని జీవోలో తెలిపారు. ఇది రావాలంటే కార్యాలయాధిపతి ద్వారా వేతన సవరణ ప్రక్రియ పూర్తి చేసికొని, అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి రివైజ్డ్ పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి. తర్వాత వారు కొత్త (రివైజ్డ్) పెన్షన్ మంజూరుతో పాటు, పెన్షన్ కమ్యుటేషన్ బకాయిలను చెల్లించాలని ట్రెజరీ ఆఫీసర్​కు ఉత్తర్వులిస్తారు. అప్పుడే ఆ ఉద్యోగికి బకాయిలు వస్తాయి. ప్రస్తుతం వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. సర్కారు నుంచి స్పష్టమైన ఆదేశాలు లేనందున ఈ బకాయిలకు ఆమోద ముద్ర వేయలేకపోతున్నామని  అకౌంటెంట్ జనరల్, ట్రెజరీ డైరెక్టర్ ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన గైడ్​లైన్స్​ ఇయ్యాలని ట్రెజరీ డైరెక్టర్ ఈ ఏడాది జులై 24న ప్రభుత్వానికి లేఖ రాసినా.. ఇంత వరకు సమాధానం రాలేదు.
పెన్షనర్ల పరిస్థితి...
సర్వీసులో ఉన్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పరిస్థితి ఇట్లా ఉంటే, పెన్షనర్ల పరిస్థితి మరో రకంగా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతనాలు, పెన్షన్లు జులై ఫస్ట్​ నుంచి వస్తున్నప్పటికీ1 జులై -2018 నుంచి 31 మార్చి -2021 మధ్యలో రిటైర్​అయిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. సవరించిన కొత్త వేతనాల ప్రకారం పెన్షన్​రావడం లేదు. పాత దాని ప్రకారమే అందుతోంది. ఇక గత మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు ఆలస్యమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెల ఫస్టుకు పడే శాలరీ.. ఇప్పుడు ప్రతి నెల 10వ తారీఖు దాకా పడుతూనే ఉన్నాయి. బ్యాంకులకు వాయిదాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఇతర ఉద్యోగులకూ..
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యావలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏ, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్టెడ్, డెయిలీ వేజ్ ఉద్యోగులందరికీ వేతన సవరణ జరిగినా, పెరిగిన వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 60, 63లలో 30 శాతం పెంపుగానీ ఏది తక్కువ అయితే దాన్ని వర్తింపజేయాలనే నిబంధనతో 30 శాతం పెంపు సౌలభ్యాన్ని ఈ ఉద్యోగులు పొందలేక పోతున్నారు. ఈ నిబంధన తొలగించి పోస్టు కనీస వేతనం గానీ, 30 శాతం పెంపు గానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని వర్తింపజేస్తేనే వీరందరికీ న్యాయం జరుగుతుంది.తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటిస్తానని, గతంలో జరిగినట్లు వేతన సవరణ ఏండ్ల తరబడి సాగదీయకుండా రెండు నెలల్లో నివేదిక తెప్పిస్తానని, పంద్రాగస్టు నుంచి కొత్త వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని 2018 మే16న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశంలో సీఎం కేసీఆర్​ప్రకటించారు. ఒక్క సభ్యుడితో వేతన సవరణ సంఘ రిపోర్టు తయారు చేయడం లేట్​అవుతుందంటూ మరో ఇద్దరు సభ్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా.. నివేదిక పూర్తయి.. సర్కారుకు సమర్పించడానికి 30 నెలలు పట్టింది. 2021 మార్చి 22న అసెంబ్లీలో సీఎం మరో​ ప్రకటన చేశారు. 11వ వేతన సవరణను ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అమలు చేస్తున్నట్లు, మొత్తంగా 9,17,979 మందికి వేతనాల పెంపుదల వర్తిస్తుందని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రత్యేక అభిమానంతో 12 నెలల బకాయిలను కూడా చెల్లించనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం ప్రకటన ప్రకారం12 నెలల బకాయిలతోపాటు వేతన సవరణ జరిగి కొత్త వేతనాలు వెంటనే అందుతాయని ఉద్యోగులు ఎంతో ఆశతో చూశారు. మార్చి 22 నాడు ప్రకటన చేస్తే.. జూన్11న సర్కారు పది జీవోలిచ్చింది.  కొత్త వేతనాలు జులై1నాడు చెల్లిస్తామని పేర్కొన్నారు. 1 జులై 2018 నుంచి 31 మార్చి 2020 వరకు 21 నెలలపాటు వేతన సవరణ నోషనల్​గా ఉంటుందని, 1 ఏప్రిల్​2020 నుంచి 31 మార్చి 2021 వరకు 12 నెలల బకాయిలను ఉద్యోగులకు పదవీ విరమణ సందర్భంగా చెల్లిస్తామని జీవోలో పేర్కొంది. 1 ఏప్రిల్​2021 నుంచి 31 జూన్​2021 వరకు రెండు నెలల బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ రకంగా వేతన సవరణ బకాయిలు చెల్లించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నడూ జరగలేదు. బకాయిలు వెంటనే చెల్లించేవారు. లేదంటే వాటిని ఉద్యోగుల జీపీఎఫ్​అకౌంట్లో కానీ జమ చేసేవారు. కానీ ఇప్పుడు రిటైర్​ అయినప్పుడే బకాయిలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
గ్రాట్యూటీ వర్తించదు..
అయితే1 జులై 2018 నుంచి 31 మార్చి 2020 మధ్య తర్వాత రిటైర్​అయిన వారిది మరో చరిత్ర. వారికి పెరిగిన గ్రాట్యూటీ వర్తించదు. కానీ పెన్షన్ కమ్యుటేషన్ మాత్రం వస్తుందని జీవోలో తెలిపారు. ఇది రావాలంటే కార్యాలయాధిపతి ద్వారా వేతన సవరణ ప్రక్రియ పూర్తి చేసికొని, అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి రివైజ్డ్ పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి. తర్వాత వారు కొత్త (రివైజ్డ్) పెన్షన్ మంజూరుతో పాటు, పెన్షన్ కమ్యుటేషన్ బకాయిలను చెల్లించాలని ట్రెజరీ ఆఫీసర్​కు ఉత్తర్వులిస్తారు. అప్పుడే ఆ ఉద్యోగికి బకాయిలు వస్తాయి. ప్రస్తుతం వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. సర్కారు నుంచి స్పష్టమైన ఆదేశాలు లేనందున ఈ బకాయిలకు ఆమోద ముద్ర వేయలేకపోతున్నామని  అకౌంటెంట్ జనరల్, ట్రెజరీ డైరెక్టర్ ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన గైడ్​లైన్స్​ ఇయ్యాలని ట్రెజరీ డైరెక్టర్ ఈ ఏడాది జులై 24న ప్రభుత్వానికి లేఖ రాసినా.. ఇంత వరకు సమాధానం రాలేదు.
పెన్షనర్ల పరిస్థితి...
సర్వీసులో ఉన్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పరిస్థితి ఇట్లా ఉంటే, పెన్షనర్ల పరిస్థితి మరో రకంగా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతనాలు, పెన్షన్లు జులై ఫస్ట్​ నుంచి వస్తున్నప్పటికీ1 జులై -2018 నుంచి 31 మార్చి -2021 మధ్యలో రిటైర్​అయిన వారి పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. సవరించిన కొత్త వేతనాల ప్రకారం పెన్షన్​రావడం లేదు. పాత దాని ప్రకారమే అందుతోంది. ఇక గత మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు ఆలస్యమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెల ఫస్టుకు పడే శాలరీ.. ఇప్పుడు ప్రతి నెల 10వ తారీఖు దాకా పడుతూనే ఉన్నాయి. బ్యాంకులకు వాయిదాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఇతర ఉద్యోగులకూ..
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యావలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏ, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్టెడ్, డెయిలీ వేజ్ ఉద్యోగులందరికీ వేతన సవరణ జరిగినా, పెరిగిన వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 60, 63లలో 30 శాతం పెంపుగానీ ఏది తక్కువ అయితే దాన్ని వర్తింపజేయాలనే నిబంధనతో 30 శాతం పెంపు సౌలభ్యాన్ని ఈ ఉద్యోగులు పొందలేక పోతున్నారు. ఈ నిబంధన తొలగించి పోస్టు కనీస వేతనం గానీ, 30 శాతం పెంపు గానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని వర్తింపజేస్తేనే వీరందరికీ న్యాయం జరుగుతుంది.