జూరాల గేట్ల రిపేర్లు ఎప్పటికి పూర్తయ్యేనో ?

జూరాల గేట్ల రిపేర్లు ఎప్పటికి పూర్తయ్యేనో ?
  • మూడేండ్ల కింద 18 గేట్ల రిపేర్‌‌‌‌‌‌‌‌ పనులు ప్రారంభం
  • ఏడాదిలోగా పూర్తి చేయాలని అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌
  • ఇప్పటికీ నాలుగింటికే రిపేర్లు చేసిన కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ
  • 12 గేట్ల నుంచి లీక్‌‌‌‌‌‌‌‌ అవుతున్న వాటర్‌‌‌‌‌‌‌‌

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ గేట్లకు రిపేర్లు చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడేండ్ల కిందే పనులు ప్రారంభించినా ఇప్పటివరకు కేవలం 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో గేట్ల నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌ లీకేజీ అవుతోంది.

2021లో స్టార్‌‌‌‌‌‌‌‌... ఏడాదిలో కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌

జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 64 గేట్లు ఉండగా 18 గేట్లకు ఇనుప రోపులు, రబ్బర్ సిల్స్‌‌‌‌‌‌‌‌ బిగించడంతో పాటు మిగతా వాటికి మైనర్‌‌‌‌‌‌‌‌ రిపేర్లు చేయాలని ఆఫీసర్లు గుర్తించారు. ఇందుకోసం 2021లో రూ. 11 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ కంపెనీ టెండర్‌‌‌‌‌‌‌‌ దక్కించుకొని పని మొదలు పెట్టింది. మొత్తం పనులను ఏడాదిలోగా కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. కానీ మూడేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 

12 గేట్ల నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌‌‌‌‌

పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ గేట్ల లీకేజీ, ఇనుప రూఫ్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు, రబ్బర్‌‌‌‌‌‌‌‌ సీల్స్‌‌‌‌‌‌‌‌ వేయడం వంటి ముఖ్యమైన పనులు వదిలేసి పెయింట్‌‌‌‌‌‌‌‌ వేయడం, సాండ్‌‌‌‌‌‌‌‌ బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌ వంటి పనులతో కాలయాపన చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాంటీ క్రేన్‌‌‌‌‌‌‌‌ రిపేర్ల పేరిట ఏడాదిపాటు కాలం వెళ్లదీశారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు గేట్ల రిపేర్లు మాత్రమే పూర్తికాగా మరో 14 గేట్ల పనులను అసలు పట్టించుకోవడమే లేదు. దీంతో 12 గేట్ల నుంచి వాటర్‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌‌‌‌‌ అవుతూ వృథాగా దిగువకు వెళ్లిపోతోంది.

ఆరు గేట్లకు రూఫ్‌‌‌‌‌‌‌‌ ముప్పు

జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో రిపేర్లు చేయాల్సిన 18 గేట్లలో ముఖ్యంగా ఆరు గేట్లకు రూఫ్‌‌‌‌‌‌‌‌ ముప్పు ఉందని గుర్తించారు. ఈ పనులు చేయించడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగాక హడావుడిగా పనులు చేయడం కాకుండా ముందుగానే పూర్తి చేయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2009 జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వరద తగ్గాక రిపేర్లు 

వరద తగ్గిన తర్వాత జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ గేట్లకు రిపేర్లు చేస్తాం. ఇప్పటికిప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యం అయ్యాయి. 

జుబేర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌, జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఈఈ